షియోమి తన లేటెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 9ను ఈ రోజు ఇండియలో లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రెండు నెలలల కిందటే ఈ ఫోన్‌ను లాంచ్ చేసినా ఇండియాలో లేటయింది. జులై 24 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. బడ్జెట్ ధరలో తమ ఫోన్ ద అన్‌డిస్‌ప్యూటెడ్ ఛాంపియన్ అని షియోమి ప్రకటించింది. అంతగా ఈ ఫోన్‌లో ఏముందో ఈ ప్రివ్యూలో చూద్దాం రండి.
సూపర్ డిస్‌ప్లే
రెడ్‌మీ నోట్ 9లో 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డాట్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పవర్ అప్ చేశారు. వెనుకవైపు 3డీ కర్వడ్ బ్యాక్ ప్యానల్ ఉంది. ఇది ఫోన్ పట్టుకోవడానికి ఎక్స్ ట్రా గ్రిప్ ఇస్తుంది. ఇవన్నీ ప్రీమియం ఫీచర్లే.
కెమెరాలు
వెనుకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంది. ఇందులో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్స్. 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్, 2ఎంపీ డెప్త్ సెన్సర్, 2ఎంపీ మాక్రో కెమెరా ఇచ్చింది. వీటి కిందే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అమర్చింది. సెల్ఫీల కోసం 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చింది. దీన్ని డిస్‌ప్లేలోనే అమర్చడంతో ప్రీమియం ఫోన్ లుక్ వస్తుంది. రెడ్‌మీ నోట్ 9లో ప్రో వీడియో మోడ్ కూడా ఉంది.
బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్
5,020 ఎంఏహెచ్‌తో భారీ బ్యాటరీ ఉంది. 22.5 వాట్స్ ఫాస్ట్ చార్జర్‌తో సూపర్ ఫాస్ట్ చార్జింగ్ చేసుకోవచ్చని షియోమి ప్రకటించింది.
గేమింగ్ ఫోన్!
మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్ గేమింగ్ లవర్స్‌కి మంచి ఆప్షన్ అంటోంది షియోమి. ఎంత భారీ గేమ్స్ అయినా ఈ ఫోన్తో ఆడేయవచ్చని చెబుతోంది. పబ్జ్‌లాంటి గేమ్స్‌ను కూడా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆడొచ్చట. ఎందుకంటే స్నాప్‌డ్రాన్ 665 ప్రాసెసర్ కంటే ఇది 21% ఎక్కువ పెర్‌ఫార్మెన్స్ ఇస్తుందని షియోమి ప్రకటించింది.
ఇవీ ధరలు
* రెడ్‌మీ నోట్ 9 4జీబీ ర్యామ్, 64 జీబీ మోడల్ ధర 11,999 రూపాయలు
* రెడ్‌మీ నోట్ 9 4జీబీ ర్యామ్, 128 జీబీ మోడల్ ధర 13,9499 రూపాయలు
* రెడ్‌మీ నోట్ 9 6జీబీ ర్యామ్, 128 జీబీ మోడల్ ధర 14,999 రూపాయలు