కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ అద్భుతమైన గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్2ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ నెల మొదటిలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయగా తాజాగా దీన్ని ప్రీ ఆర్డర్ తీసుకుంటామని ప్రకటించింది.
రెండు డిస్‌ప్లేలు
ఇది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి రెండు డిస్‌ప్లేలు ఉంటాయి. ఇందులో ఒకటి 7.6 ఇంచెస్ క్యూఎక్స్‌జీఏ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లే. ఇక రెండోది 6.2 అంగుళాల హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ కవర్ డిస్‌ప్లే, రిజల్యూషన్ కూడా చాలా హై రేంజ్‌లో ఉంది.
* స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ చిప్‌సెట్, 12 జీబీ ర్యామ్ ఉండటంతో ఫోన్ చాలా హై పెర్‌ఫార్మెన్స్ చూపిస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ కూడా 256 జీబీ ఇచ్చింది. ఇందులో 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది.
కెమెరాలు
వెనుకవైపు 12+12+12 మెగాపిక్సెల్స్‌తో మూడు కెమెరాలున్నాయి. సెల్ఫీల కోసం 10 మెగాపిక్సెల్స్‌తో రెండు కెమెరాలను ముందు వైపు ఇచ్చింది. ఇంత కాస్ట్లీ ఫోన్‌కు ఇంత తక్కువ మెగాపిక్సెల్ కెమెరాలు ఇచ్చిందంటే లెన్స్‌లు బాగా నాణ్యమైనవి అయి ఉండాలి.
బ్యాటరీ సరిపోతుందా?
ఇక బ్యాటరీ కూడా 4500 ఎంఏహెచ్ కెపాసిటీతో ఇచ్చారు. రెండు డిస్‌ప్లేలు అదీ హై రిజల్యూషన్‌తో వచ్చాయి కాబట్టి బ్యాటరీ చాలా స్పీడ్‌గా ఖర్చవుతుంది. బ్యాటరీని బాగా ఆప్టిమైజ్ చేసి ఉంటే తప్ప ఈ కెపాసిటీతో ఫోన్ మెయింటెన్ చేయడం కాస్త కష్టమే.
ధర లక్షన్నర
* సెప్టెంబర్ 14 నుండి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2 ను ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
* 12 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ప్లాన్స్‌ను కూడా అందిస్తోంది.
* మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ బ్రాంజ్ రెండు రంగుల్లో లభిస్తుంది. ధర భారత్‌లో రూ.1,49,999.