చైనా వస్తువులను బ్యాన్ చేయాలన్న భారతీయుల ఉద్వేగం కొరియన్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్‌కు అనుకోని వరమవుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల కాలంలో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కోటీ 80 లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి. అందులో దాదాపు 30% శాంసంగ్ ఫోన్లే. నెంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న షియోమిని బీట్ చేసి మళ్లీ నెంబర్ వన్ అవ్వాలని శాంసంగ్ గట్టి పట్టుదలతో ఉంది. అందుకే ఈసారి ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 5,500కే మార్కెట్లోకి రిలీజ్ చేసింది. గెలాక్సీ ఎం01 కోర్ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ముచ్చట్లేమిటో చూద్దాం.
గెలాక్సీ ఎం01కోర్ ఫీచర్లు
* 5.3అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* మీడియాటెక్ ఎంటీ6739 ప్రాసెసర్
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
* బ్లాక్, బ్లూ, రెడ్ రంగులలో లభ్యం.
కెమెరాలు
* 8 ఎంపీ రియర్ కెమెరా
* సెల్ఫీల కోసం ఫ్రంట్ 5 ఎంపీ కెమెరా
ధరలు
* 1జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర రూ.5,499
* 2 జీబీ ర్యామ్/ 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,499
* జూలై 29 నుంచి శాంసంగ్, ఇతర ఆన్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చాయి.
రెడ్‌మీ, రియల్‌మీతో పోటీ
ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఇండియాలో చాలా పెద్దది. ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మారేవారు ఎక్కువమంది ఇవే కొంటారు. ఇప్పుడు 5 నుంచి 6వేల లోపు ధరలో గెలాక్సీ ఎం01 కోర్ మొబైల్‌ను తీసుకొచ్చిన శాంసంగ్ ఈ విభాగంలో రెడ్‌మీ, రియల్‌మీకి గట్టి పోటీ ఇవ్వబోతోంది.