టెక్నాలజీ రైతుల చెంతకు చేరుతోంది. ఇప్పటికే డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీ వంటివి రైతులకు అందుబాటులోకి వచ్చాయి. గవర్నమెంట్ కూడా యాప్స్‌తో అన్నదాతలకు కావాల్సిన సమాచారం అందిస్తోంది. ఇదే బాటలో ఇప్పుడు 3ఎఫ్ ఆయిల్‌పామ్ అనే అగ్రిటెక్ కంపెనీ ఓ యాప్‌ను రిలీజ్ చేసింది. ఇది ఆయిల్‌పామ్ రైతులకు ప్రత్యేకం కావడం విశేషం.
3ఎఫ్ అక్షయ
హైదరాబాద్‌కు చెందిన 3ఎఫ్ అయిల్‌పామ్ అగ్రిటెక్ కంపెనీ పామాయిల్ రైతుల కోసం 3ఎఫ్ అక్షయ పేరుతో మొబైల్ యాప్‌ను రిలీజ్ చేసింది. పామాయిల్ రైతుల కోసం దేశంలో తొలి యాప్ ఇదేనని కంపెనీ సీఈవో, ఎండీ సంజయ్ గోయెంకా చెప్పారు.
యాప్ ఉపయోగాలేంటి?
* పామాయిల్ పండించే రైతులు ఎరువులకు యాప్ నుంచే ఆర్డర్ ఇవ్వచ్చు.
* పంట రుణాలు కూడా పొందవచ్చు
* ఎంత పామాయిల్ కాయలు అమ్మారో, దానికి సంబంధించిన డబ్బు రైతుల అకౌంట్లలో ఎప్పుడు వేస్తారో కూడా యాప్‌లో వచ్చేస్తుంది.
ఏపీలో 20 వేల మంది రైతులకు ప్రయోజనం
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఈశాన్య ప్రాంతాల్లోని రైతులు ఈ యాప్ ద్వారా ప్రయోజనం పొందవచ్చని కంపెనీ పేర్కొంది.
* ముందుగా ఏపీలోని దాదాపు 20 వేల మంది రైతు లు యాప్‌ను వెంటనే వినియోగించుకోవచ్చని తెలిపింది.