మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కలిసి ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఈ చిప్ ను రూపొందించింది. మై సర్కిల్ సేఫ్టి పేరుతో రూపొందించిన ఈ యాప్ లో...ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా అత్యవసర సమయంలో sosఅలర్ట్ మెసేజ్ ను సెండ్ చేస్తే సరిపోతుంది. ఈ యాప్ ను ఎయిర్ టెల్ వినియోగదారులతోపాటు ఇతర టెలికం కంపెనీల యూజర్లు కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. sosఅలర్ట్ మెసేజ్ లో మహిళలు తమ ఇబ్బందుల గురించి వారి కుటుంబ సభ్యులకు లేదా ఫ్రెండ్స్ కు 13 భాషల్లో పంపించుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, మళయాలం, కన్నడ, మరాఠి, పంజాబీ, బెంగాళీ, ఉర్దు, అస్సామీ, ఒరియా, గుజరాతీ ఈ భాషల్లో పంపించుకునే ఆప్షన్ ఉంటుంది.
ఒక్క బటన్ తోనే ఈ sosఅలర్ట్ ను పంపించుకునే అవకాశం ఉంటుంది. వాయిస్ కమాండ్ ఆప్షన్ సెలక్టు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. త్వరలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ ఉన్న ప్రతి స్మార్ట్ ఫోన్లో ఉండే గూగుల్ యాక్టివేషన్ ద్వారా వాయిస్‌ను పంపుకునే వీలు రానున్నది. ఈ యాప్ ద్వారా వారు ఉన్న స్థలం, ఇతర వివరాలను కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలుసుకునే అవకాశమున్నది. ఉచితంగా లభించే ఈ యాప్.. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ (ఆండ్రాయిడ్)లో లభిస్తుంది.
త్వరలో యాప్ స్టోర్ (ios)లో కూడా లభించనున్నది. మహిళలకు మరింత భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు, మహిళా సాధికారిత సాధించడంతోపాటు వారిని అత్యవసర సమయంలో ఆదుకునే విధంగా డిజైన్ చేసినట్లు గ్లోబల్ సీఐవో, ఎయిర్‌టెల్ హెడ్ హర్మీన్ మెహతా ఈ సందర్భంగా తెలిపారు.