• తాజా వార్తలు

యాపిల్ పెయిడ్ స‌బ్‌స్క్రిప్ష‌న్ల‌న్నీ నెల‌కు 195 రూపాయ‌ల‌కే అందించే యాపిల్ వ‌న్

కారు కొన‌డం గొప్ప‌కాదు. దానికి త‌గ్గ‌ట్లు మెయిన్‌టెయిన్ చేయాలంటేనే బోల్డంత ఖ‌ర్చుతో కూడిన ప‌ని. అలాగే ఐఫోన్  కొన‌డం గొప్ప‌కాదు. దాన్ని మెయింటెయిన్ చేయ‌డ‌మూ డ‌బ్బుల‌తో కూడిన వ్య‌వ‌హార‌మే. ఆండ్రాయిడ్‌లో అన్ని యాప్స్, స‌ర్వీసులు దాదాపు ఉచిత‌మే. కానీ యాపిల్ డివైస్‌లు ఐఫోన్‌, ఐపాడ్‌, మాక్‌లాంటి వాటిలో చాలా స‌ర్వీసుల‌కు నెల‌కు ఇంత‌ని చెల్లించాల్సిందే. ఐ మ్యూజిక్‌కు నెల‌కు 99, యాపిల్ టీవీకి నెల‌కు 99, యాపిల్ ఆర్కేడ్‌కు నెల‌కు 99, ఐక్లౌడ్ స్టోరేజ్‌కు (5జీబీ దాటితే) నెల‌కు 199 ఇలా క‌ట్టాల్సిందే. ఒక‌ర‌కంగా చెప్పాలంటే మ‌న దేశంలో ఫోన్ రీచార్జి ప్లాన్ కంటే ఇవే ఎక్కువ ఖ‌ర్చ‌వుతాయి. అయితే యూజ‌ర్ల‌కు ఈ భారం త‌గ్గించ‌డానికి యాపిల్ త‌న స‌ర్వీసుల‌ను బండిల్డ్ ప్యాక్‌గా తీసుకొచ్చింది. దీనిపేరు యాపిల్ వ‌న్‌. ఇండియాలో కూడా అందుబాటులో ఉంది. దీనిలో అన్ని స‌ర్వీసులు క‌లిపి త‌క్కువ ధ‌ర‌కే అందిస్తోంది. ఈ ప్లాన్స్ ఏమిటో చూద్దాం  
 
యాపిల్ వ‌న్ ఇండివిడ్యువ‌ల్ ప్లాన్ 
ఇది ఒక్క యూజ‌ర్‌కు ప‌నికొస్తుంది. అంటే ఐ ఫోన్ లేదా ఐపాడ్ వాడేవారు నెల‌కు 195 క‌డితే చాలు. నెల రోజుల‌పాటు యాపిల్ మ్యూజిక్‌, యాపిల్ టీవీ ప్ల‌స్‌, యాపిల్ ఆర్కేడ్‌, 50 జీబీ వ‌ర‌కు ఐ క్లౌడ్ స్టోరేజ్ వాడుకోవ‌చ్చు. 

యాపిల్ వ‌న్ ఫ్యామిలీ ప్లాన్ 
ఇది ఫ్యామిలీ ప్లాన్‌.  ఆరుగురు వాడుకోవ‌చ్చు. నెల‌కు 365 క‌డితే చాలు. నెల రోజుల‌పాటు యాపిల్ మ్యూజిక్‌, యాపిల్ టీవీ ప్ల‌స్‌, యాపిల్ ఆర్కేడ్‌, 200 జీబీ వ‌ర‌కు ఐ క్లౌడ్ స్టోరేజ్ వాడుకోవ‌చ్చు. 

యాపిల్ వ‌న్ ప్రీమియర్‌ ప్లాన్ 
ఇది ఎక్కువ స‌ర్వీసులు, ఎక్కువ స్టోరేజ్ కావాల‌నుకునేవారికి ప‌నికొచ్చే ప్లాన్‌.  దీన్ని కూడా ఆరుగురు వాడుకోవ‌చ్చు. నెల రోజుల‌పాటు యాపిల్ మ్యూజిక్‌, యాపిల్ టీవీ ప్ల‌స్‌, యాపిల్ ఆర్కేడ్‌, యాపిల్ న్యూస్ ప్ల‌స్‌, యాపిల్ ఫిట్‌నెస్ ప్ల‌స స‌ర్వీసుల‌తోపాటు ఆరుగురు స‌భ్యులు వాడుకోవ‌డానికి  2 టీబీ వ‌ర‌కు ఐ క్లౌడ్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. |

జన రంజకమైన వార్తలు