ఓటీటీ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆహా, జీ5 లాంటివి రోజుకు రూపాయి ధరతో ఏడాదికి 365 రూపాయలకే సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నాయి. మరోవైపు అమెజాన్ ప్రైమ్ ఏడాది చందా రూ.999గా ఉంది. నెలకు రూ.129కి అందిస్తోంది. అయితే కొత్త ఓటీటీల పోటీని తట్టుకోవడానికి ఇప్పుడు మొబైల్ ఓన్లీ సబ్‌స్క్రిప్షన్ ప్రకటించింది. దీని వివరాలేంటో చూడండి.
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు నెలకు రూ.89 చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఓన్లీ ప్లాన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఈ ప్లాన్ అందిస్తున్నా త్వరలో ఇతర కస్టమర్లకు కూడా ఇదే ప్లాన్ అందించే అవకాశముంది
ఇదీ ప్లాన్
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు 89 రూపాయలతో రీచార్జి చేస్తే 28 రోజులపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఎంజాయ్ చేయొచ్చు. అయితే అమెజాన్ ప్రైమ్‌లో ఫుల్ బెనిఫిట్స్ అంటే ఫ్రీ షిప్పింగ్, ప్రైమ్ మ్యూజిక్, ఇతర ప్రైమ్ బెనిఫిట్స్ అన్నీ పొందాలంటే రూ.139 చెల్లించాలి.
నెట్‌ఫ్లిక్స్‌కు పోటీయా?
ఆహా, జీ5వంటి రీజనల్ ఓటీటీ ప్లేయర్ల కంటే అమెజాన్‌కు నెట్‌ఫ్లిక్స్‌తోనే ప్రధానంగా పోటీ. ఎందుకంటే ఇవి రెండూ ఇంటర్నేషనల్‌గా ఫేమస్ అయిన ఓటీటీలు. నెట్ ఫ్లిక్స్ లాస్ట్ ఇయర్ జులైలో నెలకు రూ.199 ధరకు మొబైల్ ఓన్లీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ 89 రూపాయల మొబైల్ ఓన్లీ ప్లాన్ నెట్ ఫ్లిక్స్‌కు పోటీగానే వచ్చినట్లు తెలుస్తుంది.