టెక్నో మొబైల్ ఇండియా బడ్జెట్ ధరలో మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. టెక్నో స్పార్క్ పవర్ 2 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. గత ఏడాది నవంబర్‌లో ఇండియాలో లాంచ్ చేసిన టెక్నో స్పార్క్ పవర్‌కు కొనసాగింపుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
భారీ ఫోన్
టెక్నో స్పార్క్ పవర్2 స్మార్ట్‌ఫోన్ ఏకంగా 7 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. హెచ్‌డీ ప్లస్ డాట్ నాచ్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.
* మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్
* 4జీబీ ర్యామ్
* 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేషియల్ అన్‌లాక్
బాహుబలి బ్యాటరీ
ఇక ఈ ఫోన్‌లో బ్యాటరీ ప్రధాన ఆకర్షణ. 6000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ ఉంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉండటంతో గంటసేపు చార్జ్ చేస్తే బ్యాటరీ 50 నిండుతుంది.
నాలుగు కెమెరాలు
టెక్నో స్పార్క్ పవర్ 2 స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు నాలుగు కెమెరాల సెటప్ ఉంది. 16 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో లెన్స్, చివరిగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
బడ్జెట్ ధర
ఇన్ని ప్రత్యేకతలున్న టెక్నో స్పార్క్ పవర్ 2 ధర 9,999 రూపాయలు మాత్రమే. ఈ నెల 23 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుతుంది.