ఖాతాదారులకు గూగుల్ పే షాకిచ్చింది. జనవరి నుండి గూగుల్ పే వెబ్ యాప్స్ సేవలు ఆపేస్తోంది. అంతేకాదు గూగుల్ పే నుండి ఎంఎంపీఎస్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే ఛార్జీలు కూడా వేయబోతోంది... ఇలాంటి నోటిఫికేషన్లు, వార్తలు మూడు, నాలుగు రోజులుగా కుప్పలుతెప్పలుగా మీకు వచ్చి ఉంటాయి. అయితే అవన్నీ నిజమే. కానీ గూగుల్ .. అవన్నీ అమెరికాలోచేస్తున్నామని ఇండియాలో కాదని క్లారిటీ ఇచ్చేసింది. అంటే పైన చెప్పిన వార్తలేవీ ఇండియాలో యూజర్లకు సంబంధం లేదన్నమాట.
అమెరికాలో.. ఇక్కడ కాదు
గూగుల్ పే వినియోగదారులు డబ్బులు పంపించేందుకు గూగుల్ పే యాప్ లేదా గూగుల్ పే వెబ్ వాడుతున్నారు. అయితే వచ్చే జనవరి నుంచి మనీ సెండ్ చేయాలన్నా రిసీవ్ చేసుకోవాలన్నా గూగుల్. కామ్‌ను ఉపయోగించలేరని, గూగుల్ పే యాప్ మాత్రమే వాడాలని కంపెనీ నాలుగు రోజుల కిందట వెల్లడించింది. ఇండియాలో కూడా ఇదే జరుగుతుందన్న వార్తలపై గూగుల్ స్పందించింది. తాము వెబ్ ఆప్షన్ పని చేయలేదని చెప్పింది అమెరికాలోనని, ఇండియాలో కాదని క్లారిటీ ఇచ్చింది.
నో ఫీజ్ ప్లీజ్
అలాగే గూగుల్ పే ప్లాట్‌ఫాం నుండి మనీ ట్రాన్సుఫర్ చేయాలంటే ఛార్జీలు కట్టాలన్న దానిపైనా స్పందించింది. ఇది కూడా అమెరికాలోని వినియోగదారులకేనని ఇండియన్ యూజర్లు ఎలాంటి అదనపు రుసుం లేకుండానే గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని తేల్చి చెప్పేసింది. సో.. ఎప్పటిలాగానే మనం గూగుల్ పే యాప్‌తోపాటు గూగుల్‌డాట్‌కామ్ వెబ్ వెర్షన్ కూడా వాడుకోవచ్చు. అంతేకాదు ఎలాంటి రుసుము లేకుండానే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు..