సెల్‌ఫోన్ స్మార్ట్‌ఫోన్‌గా మారడానికి దాదాపు ఇరవై ఏళ్లు పట్టింది. కానీ స్మార్ట్‌ఫోన్ అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌గా మారిపోవడానికి ఇప్పుడు రెండేళ్లు కూడా పట్టడం లేదు. మూడు నాలుగేళ్ల కిందట రెండు కెమెరాలతో ఒక 3,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఫోన్లు చాలా గొప్పగా ఉండేవి. ఇప్పుడు వెనుక నాలుగు, ముందు రెండు ఆరేసి కెమెరాలతో 10 వేల లోపు ధరలో కూడా ఫోన్లు దొరికేస్తున్నాయి. ఇక డిస్‌ప్లే, బ్యాటరీ ఎంత పెద్దవయ్యాయంటే అవి ఫోన్లా, ట్యాబ్‌లా అన్నంత సైజుకు వచ్చేశాయి. ఇక్కడితో ఈ డెవలప్‌మెంట్ ఆగలేదు. మరింత ఇన్నోవేటివ్ డిజైన్స్, ఫీచర్స్‌తో ముందుకొచ్చేందుకు సెల్‌ఫోన్ కంపెనీలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లలో అలాంటి లేటెస్ట్ ఫీచర్ల గురించి రోజూ ఒకటి మీకు పరిచయం చేస్తోంది కంప్యూటర్ విజ్ఞానం. ఈ ఫీచర్లలో మొదటిగా కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానల్ గురించి తెలుసుకుందాం.
కలర్ చేంజింగ్ ఫోన్లు
ఫోన్ బ్యాక్ ప్యానల్ ఎప్పడూ ఒకే రంగులో ఉంటే బోర్ కొట్టేస్తుందా? అయితే వాటి రంగులు మార్చుకునే ఫోన్లు కూడా రాబోతున్నాయి. వివో ఇప్పటికే దీనిమీద వర్కవుట్ చేస్తోంది. ఆల్రెడీ ప్రొడక్ట్‌ను రెడీ చేసేసింది కూడా. రంగులు మారే బ్యాక్‌ప్యానల్‌తో కూడిన ఓ వీడియోను వివో లేటెస్ట్‌గా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఫోన్ బ్యాక్ ప్యానల్ బ్లూ కలర్ నుంచి హాఫ్ వైట్ కలర్‌కు మారుతోంది. ఫోన్ సైడ్ లో ఉన్న ఓ బటన్‌ను నొక్కడం ద్వారా ఈ కలర్ చేంజ్ వర్కవుట్ అయినట్లు వీడియోలో కనిపిస్తోంది.
రంగు ఎలా మారుతుంది?
ఇందుకోసం బ్యాక్ ప్యానల్‌ను ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్‌తో తయారుచేస్తున్నారు. విమానాలు, హై ఎండ్ కార్లలో గ్లాస్‌లలో నుంచి లోపలి మనుషులు బయటికి కనపడకుండా ఉండటానికి ఈ కాన్సెప్ట్‌ను వాడుతున్నారు. విండోలకు కర్టెన్ అవసరం లేకుండా వీటిలో జస్ట్ కలర్ మారే ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ వాడతారు. దీన్నే ఇప్పుడు వివో మొబైల్ ఫోన్లకు వాడుతోంది. ఓల్టేజ్‌లో మార్పులతో ఈ రంగు మార్పు సాధ్యమవుతుంది. త్వరలోనే ఈ బ్యాక్ కలర్ చేంజింగ్ సెల్ ఫోన్లతో వివో మార్కెట్‌లో సందడి చేయబోతోంది.