• తాజా వార్తలు

ప్రివ్యూ- ఈ మెయిల్స్ ని చాట్ స్టైల్లో పంపడానికి వెరైటీ యాప్-డెల్టా చాట్

డెల్టా చాట్ యాప్.....ఈ మెయిల్స్ ను చాట్ స్టైల్లో పంపించడానికి ఉపయోగించే ఫ్రీ ఈమెయిల్ మెసేంజర్ యాప్. ఈ యాప్ చాలా సురక్షితమైంది. వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ నుంచి ఎలా చాటింగ్ చేస్తామో...ఈ డెల్టా చాట్ యాప్ నుంచి ఈ మెయిల్స్ ను చాట్ స్టైల్లో పంపించుకోవచ్చు. ట్రాకింగ్ కు ఎలాంటి అవకాశం ఉండదు. మీరు పంపించాలనుకున్న వారి ఈమెయిల్ ఐడి ఉంటే చాలు....ఫైల్స్ పంపించుకోవచ్చు. అంతేకాదు ఇమేజ్ లు, ఫీల్డర్లను కూడా యాడ్ చేయవచ్చు. ఇతర యాప్స్ వలె బబుల్స్ కూడా కనిపిస్తాయి. మీరు ఈజీగా మెసేజేస్ ను ఫార్వర్డ్ చేసుకోవచ్చు. 

ఈమెయిల్స్ కొత్తగా పంపించాలనుకుంటే....ఈ యాప్ ను ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, లూనక్స్ లలో అందుబాటులో ఉంది. ఈయాప్ విండోస్ లో త్వరలోనే అందుబాటులోకి రానుంది. మీరు ఈమెయిల్ పంపించేవారికి ఈ యాప్ ఉండాల్సిన పనిలేదు. మెయిల్ ప్రొవైడర్ సైట్లో మెసేజ్ ను చూసుకోవచ్చు. ఒకవేళ ఈ యాప్ ఉన్నట్లయితే....ఈమెయిల్స్ చాట్ రూపంలో మార్చబడుతాయి. ఈమెయిల్స్ ను చాటింగ్ స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం....

ట్రాకింగ్ లేకుండా IMAPఫ్రీ మెసేజ్ యాప్....
ఈ IMAP ఆధారిత చాటింగ్ యాప్ ఉపయోగించడం చాలా ఈజీ. ఈ యాప్ ను ఉపయోగించేందుకు రిజిస్ట్రేషన్ తో పనిలేదు. ప్లే స్టోర్ నుంచి ఇన్ స్టాల్ చేసి....వాడుకోవచ్చు. మీ ఈమెయిల్స్ అడ్రెస్ ను ఎంటర్ చేసి...మీకు కావాల్సిన వారికి చాట్ స్టైల్లో ఈ మెయిల్స్ పంపించుకోవచ్చు. అంతేకాదు ఈ యాప్ ద్వారా ఇతర ఫీచర్స్ గురించి కూడా తెలుసుకుంటారు. 
ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసి....ఓపెన్ చేయండి. ఫస్ట్ స్క్రీన్లో...ఓపెన్ చేయడానికి మీ ఈమెయిల్స్ అడ్రెస్, పాస్వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ ను ఉపయోగించాలనుకుంటే జిమెయిల్ స్టైల్లో చాట్ చేయవచ్చు. జిమెయిల్ లో ఎలా చాట్ చేయాలో ఓ సారి చూద్దాం. 

జీమెయిల్ సైన్ ఇన్ చేసిన తర్వాత...మీకావాల్సిన వారితో చాటింగ్ చేయవచ్చు. ఇదివరకే ఉన్న ఈమెయిల్స్ కాంటాక్ట్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇతర చాట్ ను స్టార్ట్ చేయడానికి ఒక కొత్త మెయిల్ అడ్రెస్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక కామన్ మెసెజ్ ను మాత్రమే పంపించినట్లయితే....అది వెంటనే రిసెప్షన్ కు చేరుతుంది. అంతేకాదు చాటింగ్ లో ప్లెయిన్ టెక్ట్స్, ఇమెజేస్ యాడ్ చేయడంతోపాటు ఇతర ఫైళ్లను కూడా పంపించవచ్చు. ఇందులో వాట్సాప్ వలె ఇంటర్ స్పేస్ చాలా ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా మీడియా ఆప్షన్స్ ద్వారా....ప్రైవసీ కోసం సెట్టింగ్స్ ఆప్షన్స్ కూడా ఓపెన్ చేయవచ్చు. అంతేకాదు మీ మెయిల్ అడ్రెస్ కోసం ఒక క్యూఆర్ కోడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ఉపయోగించి ఇతరులకు క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసుకునే సదుపాయం ఉంటుంది. 

ఈవిధంగా మీ ఫోన్లో...సాధారణ ఈమెయిల్ మెసెంజర్ యాప్ ఉపయోగించుకోవచ్చు. ఫోన్లో మాత్రేమ కాదు...డెస్క్ టాప్ పైకూడా ఉపయోగించుకోవచ్చు. బైనరీలను github పేజీ నుంచి డౌన్ లోడ్ చేసుకోని...మీకు కావాల్సిన చోట వాటిని వాడుకోవచ్చు. 

జన రంజకమైన వార్తలు