• తాజా వార్తలు

ప్రివ్యూ- ఎయిర్ టెల్ ఫ్రీ వై-ఫై జోనులు

ఫ్రీ వై-ఫై ఆఫర్లతో జియో కస్టమర్లను తనవైపు తిప్పుకుంది ఎయిర్ టెల్. టెలికాం రంగంలో సంచలనం క్రియేట్ చేసిన జియో నుంచి పోటీ ఎదుర్కోవడానికి ఎయిర్ టెల్ కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే భారతీ ఎయిర్ టెల్ ఫ్రీ వై-ఫై జోన్ సర్వీసులను అందిస్తోంది. దాదాపు 500 పైగా ప్రదేశాల్లో వై-ఫై హాట్ స్పాట్ లను అందజేస్తోంది. దీంతో ఎయిర్ టెల్ యూజర్లు...ఎయిర్ టెల్ సిమ్ తో కనెక్ట్ చేసుకుని ఫ్రీ వై-ఫైను వినియోగించుకోవచ్చు. ఫ్రీ వై-ఫైకు సంబంధించిన వివరాలను ఎయిర్ టెల్ దాని అనుబంధ వెబ్ సైట్లో ఉంచింది. ఎయిర్ టెల్ ఉచిత వై-ఫై జోనులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుకుందాం. 

మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా కనెక్ట్ చేయడం....
ఎయిర్ టెల్ ఉచిత వై-ఫై సేవలు....ఎయిర్ పోర్టులు, కళాశాలలు, హాస్పిటల్స్, కార్పొరేట్ పార్కులు, రిటైల్ దుకాణాలతోపాటు మరికొన్ని బహిరంగ ప్రదేశాల్లో  అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉంది. పోస్ట్ పెయిడ్ యూజర్లకు ఈ సర్వీసులు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఒకవేళ మీరు ఎయిర్ టెల్ వైఫై జోనులో ఉన్నట్లయితే...మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా వైఫై అనే ట్యాప్ పై నొక్కండి. ఇలా చేస్తే వైఫై కనెక్ట్ అవ్వడానికి మై ఎయిర్ టెల్ యాప్ అనుమతిస్తుంది. ఈ యాప్ తోపాటుగా otp ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. @:ఫ్రీ ఎయిర్ టెల్ వైఫై అనే పేజీని ఓపెన్ చేసి ssidకి కనెక్ట్ చేయండి. ఇప్పుడు వైఫై నెట్ వర్క్ కు సైన్ ఇన్ అవుతుంది. తర్వాత otpవెరిఫికేషన్ ప్రాసెస్ తో కంటిన్యూ చేయడానికి ఎయిర్ టెల్ యూజర్ బటన్ నొక్కండి. 

మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా...ఉచిత వైఫై జోన్ను కనెక్ట్ చేసుకున్నట్లయితే....మీ బ్యాలెన్స్ డేటాను సులభంగా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ మొబైల్ డేటా ముగిసినట్లయితే....ఇంటర్నెట్ వినియోగించుకోవడానికి వైఫైని డిస్కకనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎయిర్ టెల్ వైఫై జోన్ సర్వీసును పొందాలనుకుంటే...ఎయిర్ టెల్ అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.  లాగిన్ అయ్యాక...మీ నగరం పేరు, లొకేషన్ పేరు ఎంటర్ చేయాలి. 

ఫ్రీ డేటా ఎయిర్ టెల్ వై-ఫై జోన్లు...
ఎయిర్ టెల్ తీసుకువచ్చిన ఈ కొత్త ఆఫర్ తో....అన్ లిమిటెడ్ కంబో ప్లాన్ సబ్ స్క్రిబ్షన్తో... యూజర్ 10జిబి డేటాను ఉచిత వైఫై జోన్లో ఉపయోగించుకోవచ్చని టెలికాం ప్రకటించింది. అయితే ఎయిర్ టెల్ యూజర్లు మై ఎయిర్ టెల్ యాప్ లేదా ఎయిర్ టెల్ సెల్ఫ్ కేర్ వెబ్ సైట్ నుంచి మిగిలిన డేటాను గురించి తెలుసుకోవచ్చు. ఎయిర్ టెల్ అన్ లిమిటెడ్ కంబో ప్లాన్ షిప్ తో 10జిబి ఫ్రీ వైఫై డాటాను ఉపయోగించుకోవచ్చు.  ప్రస్తుతం, ఎయిర్ టెల్ వై-ఫై జోన్ సర్వీసు ఢిల్లీ, కర్నాటక, పూణే, హైదరాబాద్ ప్రాంతాలతోపాటు మరికొన్ని ప్రదేశాల్లో  అందుబాటులో ఉంది.
 

జన రంజకమైన వార్తలు