• తాజా వార్తలు

కరోనా ను ముందే కనిపెట్ట గలిగే, గోకీ స్మార్ట్ బ్యాండ్.. 

స్మార్ట్‌వాచ్‌ల కాలం ఇది.  ఆరోగ్యం మీద శ్ర‌ద్ధ పెరుగుతుండ‌టంతో చాలామంది వీటిని కొని త‌మ ఆరోగ్య‌స్థితిగ‌తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకుంటున్నారు. ఇందులో ఇప్పుడో కొత్త ఫీచ‌ర్‌తో వ‌చ్చింది గోకీ వైట‌ల్ 3.0. క‌రోనాకు ప్ర‌ధాన ల‌క్ష‌ణ‌మైన జ్వ‌రాన్ని ముందే క‌నిపెట్టేస్తుంద‌ట ఈ స్మార్ట్ బాండ్ . ఏంటా క‌థ చూద్దాం ప‌దండి. 

ఇవీ గోకీ వైట‌ల్ 3.0 ఫీచ‌ర్లు  
* మీ రోజువారీ యాక్టివిటీ అంటే మెట్లు ఎక్క‌డం, దిగ‌డం, ఎంతదూరం న‌డిచారు? ఎన్ని కేల‌రీలు క‌రిగాయి వంటివ‌న్నీ ట్రాక్ చేస్తుంది. 

* బీపీని మానిట‌ర్ చేస్తుంది.

* హార్ట్ రేట్‌ను మానిట‌ర్ చేస్తుంది. 

* వాట‌ర్ ప్రూఫ్‌. మీయాక్టివిటీతోపాటు ఫోన్ నోటిఫికేష‌న్స్‌, వాట్సాప్‌, ఫేస్బుక్ నోటిఫికేష‌న్స్ కూడా చూసుకోవ‌చ్చు.

* ఏడాదిపాటు వారంటీ 

 

టెంప‌రేచ‌ర్ పెరిగితే చెప్పేస్తుంది
క‌రోనా కాలంలో బాడీ టెంప‌రేచ‌ర్ ఎంతుందో చూసుకోవ‌డం అంద‌రూ చేస్తున్న‌దే. ఈ గోకీ వైట‌ల్ 3.0 మీ బాడీ టెంప‌రేచ‌ర్‌ను కూడా మానిట‌ర్ చేస్తుంది. క‌రోనాకు తొలి ల‌క్ష‌ణ‌మైన టెంప‌రేచ‌ర్ పెరుగుద‌ల‌ను లెక్క‌గ‌ట్టే తొలి వేర‌బుల్ డివైస్ ఇదేన‌ని కంపెనీ చెబుతోంది. 

 

1000 గోకీవైట‌ల్స్ పంచిన అక్ష‌య్ 
బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్ దీన్ని ప్ర‌మోట్ చేస్తున్నారు. సొంతంగా 1000 గోకీ వైట‌ల్ 3.0ల‌ను కొని ముంబ‌యి పోలీసుల‌కు పంచిపెట్టారు.  

ధ‌ర‌

ఈ గోకీ వైట‌ల్ 3.0 ధ‌ర 3,999 రూపాయ‌లు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌తోపాటు ఈకామ‌ర్స్ వెబ్‌సైట్ల‌న్నింటిలోనూ ల‌భిస్తుంది.  

జన రంజకమైన వార్తలు