చైనా బ్రాండ్ టెక్నోమొబైల్ కంపెనీ బడ్జెట్‌లో ఓ సరికొత్త గేమింగ్ ఫోన్‌ను తీసుకొచ్చింది. టెక్నో పోవా పేరుతో వచ్చిన ఈ ఫోన్ ఇప్పటికీ నైజీరియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇండియా మార్కెట్లోకి కూడా వస్తోంది. గేమింగ్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలోనేఈ ఫోన్‌ను తీసుకొచ్చినట్లు టెక్నో చెబుతోంది.
టెక్నో పోవా ఫీచర్లు
* 6.8 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డాట్-ఇన్ డిస్ ప్లే
* ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జీ80 ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 10 ఆధారిత హైఓఎస్ 7ఆపరేటింగ్ సిస్టం
* 4జీబీ / 6 జీబీ ర్యామ్
* 64జీబీ/ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
కెమెరాలు
టెక్నో పోవాలో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీంతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, ఏఐ లెన్స్ ఇచ్చింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చింది.
బ్యాటరీ
టెక్నో పోవాలో భారీ బ్యాటరీ ఉంది. దీని సామర్థ్యం 6000 ఎంఏహెచ్. 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
ధర
టెక్నో పోవా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 11,999.
డిసెంబర్ 11న మధ్యాహ్నం ఫ్లిప్ కార్ట్ లో ఫస్ట్ సేల్ ప్రారంభమవుతుంది.