• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ పేరు స్నో కోన్.. త్వ‌ర‌లో ‌విడుదల

ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ విడుద‌ల‌కు గూగుల్ రంగం ‌సిద్ధం చే‌స్తోంది. ప్ర‌తిసారీ ఆండ్రాయిడ్ వెర్షన్‌కు నంబ‌ర్‌తోపాటు ఒక స్వీట్ లేదా డిజర్ట్ పేరు పెట్ట‌టం గూగుల్‌కు  ఆన‌వాయితీ. అలా‌గే ఈ‌సా‌రి రిలీజ్ చేయనున్న ఆండ్రాయిడ్ 12 వెర్షన్ కి స్నో కోన్ అని పేరు పెట్టబోతోందని తెలుస్తోంది.  ఆండ్రాయిడ్ 12 SC  అని దీని సోర్స్ కోడ్  ఉందని ఎక్స్ డీ ఏ  డెవలపర్స్ చెబుతున్నారు. ఆండ్రాయిడ్ 11 కి కూడా గతంలో rvc అని సోర్స్ కోడ్ పెట్టారని రెడ్ వెల్వెట్ కేక్ అని తాను అప్పుడు చెప్పింది నిజమైందని వాళ్ళు అంటున్నారు.ఇప్పటి వరకు  ఆండ్రాయిడ్ వెర్షన్లకు పెట్టిన పేర్లివి  ఆండ్రాయిడ్ 1.5: ఆండ్రాయిడ్ కప్ కేక్  ఆండ్రాయిడ్ 1.6: ఆండ్రాయిడ్ డోనట్ ఆండ్రాయిడ్ 2.0: ఆండ్రాయిడ్ ఎక్లైర్ ఆండ్రాయిడ్ 2.2: ఆండ్రాయిడ్ ఫ్రోయో ఆండ్రాయిడ్ 2.3 : ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆండ్రాయిడ్ 3.0: ఆండ్రాయిడ్ హనీ కోమ్ ఆండ్రాయిడ్ 4.౦: ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆండ్రాయిడ్ 4.1 నుంచి 4.3.1: ఆండ్రాయిడ్ జెల్లీ బీన్ ఆండ్రాయిడ్ 4.4 నుంచి 4.4.4 : ఆండ్రాయిడ్ కిట్ కాట్  ఆండ్రాయిడ్ 5 .౦ నుంచి 5.1 .1 : ఆండ్రాయిడ్ లాలీ పాప్ ఆండ్రాయిడ్ 6.0 నుంచి 6.౦.1: ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఆండ్రాయిడ్ 7.0 నుంచి 7.1 : ఆండ్రాయిడ్ నౌగాట్ ఆండ్రాయిడ్ 8.0 నుంచి 8.1 : ఆండ్రాయిడ్ ఒరియో ఆండ్రాయిడ్ 9.0 : ఆండ్రాయిడ్ పై  అయితే తరువాత ఆండ్రాయిడ్ 10,11 లకు గూగుల్ ఎలాంటి పేరు పెట్టలేదు. మళ్ళీ ఆండ్రాయిడ్ 12లో పాత ట్రెండ్ కి వెళ్తుందేమో చూడాలి

జన రంజకమైన వార్తలు