• తాజా వార్తలు

ఇక గూగుల్ డ్రైవ్‌లో ట్రాష్ నెల రోజుల త‌ర్వాత ఆటోమేటిగ్గా డిలెట్ అయిపోతుంది

గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అయిన ఫోటో లేదా డాక్యుమెంట్ మీరు ట్రాష్‌లో వేస్తే  మ‌ళ్లీ దాన్ని మీరే రిమూవ్ చేయాలి. అప్ప‌టి వ‌ర‌కు అది ట్రాష్‌లోనే ఉంటుంది. ఇది ఇక పాత ముచ్చ‌టే. ఎందుకంటే మీరు ట్రాష్‌లో వేసిన ఫోటో లేదా డాక్యుమెంట్‌ను నెల రోజుల త‌ర్వాత ఆటో డిలెట్ చేసే ఫీచ‌ర్‌ను గూగుల్ తీసుకురాబోతోంది. 

అక్టోబ‌ర్ 13 నుంచి
ఈ కొత్త ఫీచ‌ర్ గురించి గూగుల్ రీసెంట్‌గా త‌న బ్లాగ్‌లో వెల్ల‌డించింది. అక్టోబ‌ర్ 13 నుంచి ఈ ఫీచ‌ర్ గూగుల్ డ్రైవ్ యూజ‌ర్లంద‌రకీ అందుబాటులోకి రానుంది. 

ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకోండి
అయితే ఇదివ‌ర‌కు పొర‌పాటున ఏదైనా ట్రాష్‌లో వేస్తే మ‌ళ్లీ మ‌న‌మే మాన్యువ‌ల్‌గా రిమూవ్ చేసేవ‌ర‌కు అక్క‌డే ఉంటుంది కాబ‌ట్టి ఆ ఫైల్ లేదా ఫోటో సేఫ్‌గానే ఉండేది. ఇప్పుడు 30 రోజుల త‌ర్వాత ఆటో డిలెట్ అవుతుంది కాబ‌ట్టి ఏద‌యినా ఫైల్ లేదా ఫోటోను ట్రాష్‌లో వేసేముందు ఒక‌టికి రెండుసార్లు చెక్ చేసుకోండి. లేదంటే ఇంపార్టెంట్ ఫైల్స్ పోయే ప్ర‌మ‌ద‌ముంది.

అయితే షేర్డ్‌ గూగుల్ డ్రైవ్స్ వాడేవారికి అడ్మిన్ 25 రోజుల వ‌ర‌కు ఇలా పూర్తిగా డిలెట్ అయిపోయిన డేటాను కూడా తిరిగి తీసుకోవ‌చ్చు.  

జన రంజకమైన వార్తలు