• తాజా వార్తలు

ఏమిటీ గూగుల్ ఫోటోస్ సినిమాటిక్ ఎఫెక్ట్‌.. ఇంత‌కీ మీరు చూశారా?

స్మార్ట్‌ఫోన్ వాడేవారంద‌రికీ గూగుల్ ఫోటోస్ గురించి తెలుసు. మీరు ఫోన్‌లో తీసిన లేదా మీ ఫోన్‌లో సేవ్ చేసిన ఫోటోలు, వీడియోల‌ను గూగుల్ త‌న ఫోటోస్ ఫీచ‌ర్‌లో స్టోర్ చేస్తుంది. అంతేకాదు ఆ ఫోటో మ‌ళ్లీ ఏడాది అదే రోజు మీకు చూపిస్తుంది. అంతేకాదు యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి మీ ఫోటోల‌తో వీడియోల్లాగా త‌యారుచేసి అందిస్తోంది.లేటెస్ట్‌గా ఇప్పుడు త్రీడీ లాంటి పీచ‌ర్ల‌తో మీ పాత  ఫోటోల‌తో వీడియోలాగా కూడా త‌యారుచేసి చూపిస్తోంది. 

గూగుల్ ఫోటోస్ సినిమాటిక్ ఎఫెక్ట్‌
గూగుల్ ఫోటోస్‌లో స్టోర్ అయి ఉన్న మీ పాత ఫోటోల నుంచి కొన్నింటిని సెలెక్ట్ చేసి దానికి 3డీ ఎఫెక్ట్ అద్ది మీకు అందిస్తోంది. దీనికి సినిమాటిక్ ఎఫెక్ట్ అని పేరు పెట్టింది. 
*  ఈ ఫోటోలు మీ గూగుల్ ఫోటోస్ యాప్‌లో మెమ‌రీస్ సెక్ష‌న్‌లో క‌నిపిస్తాయి.
*ఇవి ఫోటోల‌లాగా, కొన్ని ఫోటోలు క‌లిపి వీడియోలు కూడా త‌యారుచేసింది.
* వీటిని మీరు చూసి సంబ‌ర‌ప‌డొచ్చు. అంతేకాదు సోష‌ల్ మీడియాలో ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో కూడా షేర్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు