• తాజా వార్తలు

గూగుల్ కాల్ యాప్ పేరుతో గూగుల్ నుంచి కాల‌ర్ ఐడీ యాప్‌.. త్వ‌ర‌లోనే

మ‌న‌కు ఏదైనా కాల్ వ‌స్తే అది ఎవ‌రి నుంచి వ‌చ్చిందో కాంటాక్ట్స్ లో ఉంటే పేరు వ‌స్తుంది. మ‌న‌కు అప‌రిచిత వ్య‌క్తుల నుంచి వ‌స్తే ట్రూ కాల‌ర్ యాప్ లాంటి కాల‌ర్ ఐడీ యాప్ వాడుతున్నాం. ఈ పోటీలోకి టెక్నాల‌జీ దిగ్గ‌జం కూడా అడుగుపెట్ట‌బోతోంది. గూగుల్ కాల‌ర్ యాప్ పేరుతో కాల‌ర్ ఐడీ యాప్‌ను తీసుకురాబోతోంది. థ‌ర్డ్ పార్ట్ యాప్ కాబట్టి సెక్యూరిటీ రీజ‌న్స్‌తో్ చాలామంది ట్రూకాల‌ర్ యాప్ వాడ‌టానికి సందేహిస్తున్నారు. అందుకోస‌మే గూగుల్ ఈ యాప్‌ను తీసుకురాబోతోంఇ.  

ఏమిటి ఇందులో ఫీచ‌ర్లు? 
*  గూగుల్ కాల్ యాప్ స్పామ్ కాల్స్ నుండి రక్షణ  ఇస్తుంది. 
* యాప్‌లో కొత్తగా కాలర్ ఐడీ ఫీచర్‌ను జోడించారు. దాంతో కాల్ వచ్చినప్పుడు కాలర్ పేరు, ఫోన్ నంబర్‌ చదివి వినిపిస్తుంది. * నెల‌ రోజుల తర్వాత పాత కాల్ స్క్రీన్‌ రికార్డింగ్‌లు వాటంతటవే డిలీట్ అయ్యే ఫీచర్ కూడా ఉంది. 

త్వ‌ర‌లోనే ప్లే స్టోర్లో అందుబాటులోకి  
ప్రస్తుతానికి గూగుల్ కాల‌ర్ యాప్ బీటా వెర్ష‌న్‌గా లిమిటెడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. గూగుల్ ప్లే స్టోర్ లో ఇంకా అందుబాటులో లేనప్పటికి త్వరలో అధికారికంగా తీసుకురానుంది.  యూట్యూబ్ లో వచ్చిన ప్రకటనలో గూగుల్ కాల్ యాప్ పేరు, లోగోను వెల్లడించింది.

జన రంజకమైన వార్తలు