• తాజా వార్తలు

ప్రివ్యూ - న్.ఫ్.సీ డెబిట్ కార్డ్ సేవ‌ల్లోకి గూగుల్ పే

గూగుల్ పే.. ఇండియ‌న్ డిజిటల్ పేమెంట్స్ మోడ్‌లో ఓ విప్ల‌వం. అప్ప‌టివ‌ర‌కు పేటీఎం, ఫోన్ పే, మొబీక్విక్ లాంటి డిజిట‌ల్ పేమెంట్స్ యాప్‌లు ఉన్నా వాటిలో డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్‌తో మ‌నీ లోడ్ చేసుకుని ఆ మ‌నీని ఏదైనా ట్రాన్సాక్ష‌న్ల‌కు వాడుకునేవాళ్లం. గూగుల్ పే వ‌చ్చాక ఆ జంఝాటాల‌న్నీ మ‌టుమాయ‌మైపోయాయి. డైరెక్ట్‌గా మీ బ్యాంక్ అకౌంట్‌తో లింక‌య్యే మీ గూగుల్ పే నుంచి ఏ ట్రాన్సాక్ష‌న్ అయినా నేరుగా చేసేయొచ్చు. సింగిల్ క్లిక్‌తో మ‌నీ ట్రాన్సాక్ష‌న్స్‌, బిల్ పేమెంట్స్ అన్నీ అయిపోతున్నాయి.  ఓర‌కంగా చెప్పాలంటే ఇండియాలో డిజిట‌ల్ పేమెంట్స్  గూగుల్ పేతో పీక్స్‌కు వెళ్లాయి. ఇప్పుడు అదే ఉత్సాహంతో గూగుల్ డెబిట్ కార్డ్‌ను కూడా తీసుకురాబోతోంది. 

గూగుల్‌పేకు అనుసంధానంగా 
‘గూగుల్‌ పే’కి అనుసంధానంగా ఉండేలా డెబిట్‌ కార్డును ప్రవేశపెట్టాలని గూగుల్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనికి గూగుల్‌ కార్డ్‌గా పేరు పెట్టిన‌ట్లు తెలుస్తోంది.  ఈ కార్డు ఫిజికల్‌గానే కాకుండా వర్చువల్‌గానూ అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. 

నియ‌ర్‌ఫీల్డ్ క‌మ్యూనికేష‌న్ ఆప్ష‌న్‌
ఫిజికల్‌ కార్డుతో రిటైల్‌ విక్రయ కేంద్రాల వద్ద చెల్లింపులు జరపవచ్చు.  నియ‌ర్ ఫీల్డ్ క‌మ్యూనికేష‌న్‌ (ఎన్‌ఎఫ్‌సీ) పేమెంట్‌ ఆప్షన్ కూడా ఉండబోతుంద‌ని స‌మాచారం. ఈ ఫీచ‌ర్ ఉంటే మీరు కార్డ్‌ను ఏ స్వైపింగ్ మిష‌న్‌లోనూ పెట్ట‌కుండానే కాంటాక్ట్ లెస్ పేమెంట్ చేయొచ్చు.  స్వైపింగ్ మిష‌న్‌లో స్కిమ్మ‌ర్స్ పెట్టి మీ కార్డు డేటా దొంగిలించి డ‌బ్బులు కొట్టేసే వాళ్ల‌ను అడ్డుకోవడానికి ఈ ఎన్ఎఫ్‌సీ క‌మ్యూనికేష‌న్ మోడ్ బాగా ఉప‌యోగ‌పడుతుంది. ఈ  ఆప్ష‌న్ క‌నుక వ‌స్తే గూగుల్ పే లాగే గూగుల్ కార్డ్ కూడా సూప‌ర్  హిట్ అవుతుందంటున్నారు మార్కెట్ నిపుణులు

జన రంజకమైన వార్తలు