బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ నినాదం ఇండియన్ మార్కెట్‌ను ఊపేస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా ఫోన్లదే హవా. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో షియోమి, రెడ్‌మీ, రియల్‌మీ లాంటి ఫోన్లు ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా.. లావా జెడ్61 ప్రో పేరుతో ఓ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. పూర్తి ఇండియన్ మేడ్ కావడం దీని ప్రత్యేకత.
తక్కువ ధరలోనే
తక్కువ ధరలో చాలా ఆకర్షణీయంగా, బడ్జెట్ ధరలను కోరుకునే వినియోగదారులకు లేదా ఫీచర్ ఫోన్ నుండి స్మార్ట్‌ఫోన్‌కు మారాలనుకునేవారికి ఈ లావా జెడ్ 61 ప్ర్రో చక్కటి ఎంపిక అవుతుందని లావా ప్రకటించింది. ధర తక్కువగా ఉండటంతో ఇండియన్ మార్కెట్లో క్లిక్ అయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ క్లాస్‌ల కోసమో, లేకుంటే లాక్‌డౌన్‌లో ఫోన్ పాడయిందనో కొత్త ఫోన్‌ను బడ్జెట్‌లో కొనాలకునేవారికి ఇది మంచి ఎంపిక అయ్యే అవకాశం ఉంది.
ఇవీ ఫీచర్లు
* 5.45 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 1.6 గిగాహెడ్జ్ ప్రాసెసర్
* 2 జీబీ ర్యామ్
* 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. ఎస్డీ కార్డ్‌తో 128 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకవోచ్చు.
కెమెరాలు
* వెనుకవైపు 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చింది.
* పోట్రెయిడ్ మోడ్, బ్యూటీ మోడ్, పనోరమా లాంటి కెమెరా ఫీచర్లతోపాటు ఫిల్టర్స్ కూడా ఉన్నాయి.
* 3100 ఎంహెచ్ బ్యాటరీ ఉంది.
* ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంది.
* ఫేస్ అన్‌లాక్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 0.6 సెకన్లలో అన్‌లాక్ అవుతుంది.
ధర
* లావా జెడ్61 ప్రో ధర 5,774 రూపాయలు.
* రెడ్, బ్లూ కలర్స్‌లో దొరుకుతుంది.
* ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఈకామర్స్ సైట్లతోపాటు ఆఫ్‌లైన్ మార్కెట్‌లో కూడా లభిస్తుంది.