సెల్‌ఫోన్ అంటే ఒకప్పుడు నోకియానే. డ్యూయల్ సిమ్‌లున్న ఫోన్లు తీసుకురావడంలో నోకియా వెనుకబాటు దాన్ని మొత్తంగా సెల్‌ఫోన్ రేస్ నుంచే పక్కకు నెట్టేసింది. ఆ తర్వాత నోకియా పరిస్థితిని అర్థం చేసుకుని మార్కెట్లోకి వచ్చినా మునుపటి అంత స్పీడ్ లేదు. అయితే ఇప్పుడు నోకియా కొత్తగా ల్యాప్టాప్‌ల సేల్స్‌లోకి అడుగుపెడుతుండటం విశేషం. నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 పేరుతో ల్యాప్‌టాప్ తీసుకువస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌లో అప్‌డేట్ వచ్చింది.
నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14లో ఫీచర్లు
* ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్. ఐ3 ప్రాసెసర్‌తోనూ కొన్ని మోడల్స్ రావచ్చు
* 14 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌డీ బ్యాక్‌లిట్ ఐపీఎస్ డిస్‌ప్లే
* డాల్బీ విజన్ అట్మాస్ సపోర్ట్
* బరువు 1.1 కేజీలు
* 8జీబీ ర్యామ్
* 512 జీబీ స్టోరేజ్
* బిల్ట్ ఇన్ డ్యూయల్ స్పీకర్స్, బిల్ట్ ఇన్ డ్యూయల్ మైక్రోఫోన్లు
* యుఎస్‌బి 3.0, హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు
* 8 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్
ఫ్లిప్‌కార్ట్లో అమ్మకాలు
నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14 ఇండియన్ మార్కెట్‌లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంకా డేట్ చెప్పలేదు. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) వెబ్‌సైట్‌లో దీన్ని లిస్టింగ్ చేసింది. దీని ప్రకారం మొత్తం 9 మోడళ్లలో ఈ ల్యాప్‌టాప్‌లు రాబోతున్నాయి. కొత్త ల్యాప్‌టాప్‌లు నోకియా బ్రాండింగ్‌తో వస్తున్నాయి. అయితే అవి హెచ్ఎండీఏ గ్లోబల్ తయారుచేసిందా లేక ఏదైనా థర్డ్ పార్టీ చేత తయారుచేయించారా అనేది ఇంకా తెలియదు. అయితే ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరగుతుతాయని తెలుస్తోంది. ధర 90వేల ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది.