• తాజా వార్తలు

యూత్ కోసం కొత్త ఫోన్.. ఆరు కెమెరాల‌తో ఒప్పో ఎఫ్ 17 ప్రో

కుర్ర‌కారుకు స్మార్ట్‌ఫోన్‌లో ముఖ్యంగా కావాల్సింది కెమెరాలే. ఎన్ని కెమెరాలున్నాయి.. దానిలో ఎన్ని ఫీచ‌ర్లున్నాయి అని చూసే మిలీనియ‌ల్స్ కోసం ఒప్పో ఏకంగా ఆరు కెమ‌రాలున్న ఫోన్‌తో రాబోతోంది. ఒప్పో ఎఫ్‌17 ప్రో పేరుతో వ‌స్తున్న ఈ ఫోన్ విశేషాలేంటో చూద్దాం.

స్లిమ్ ఫోన్ 
ఒప్పో ఎఫ్ 17 ప్రో స్లిమ్‌గా రాబోతోంది.  7.48 మిల్లీమీట‌ర్ల మందంతో ఉన్న ఈ ఫోన్ 164 గ్రాముల బ‌రువుంటుంది. ఈ ఫోన్ ఈ ఏడాది స్లిమ్మెస్ట్ ఫోన్ అని ఒప్పో చెబుతోంది. దీన్ని జేబులో పెట్టుకోవ‌డానికి సులువుగా ఉంటుంద‌ని అంటోంది. 

ఆరు కెమెరాలు 
ఒప్పో ఎఫ్‌17 ప్రోలో ఆరు కెమెరాలున్నాయి. వెనుక‌వైపు నాలుగు కెమెరాల సెట‌ప్ ఉంది. ఐఫోన్‌లో మాదిరిగా వీటిని స్క్వేర్‌గా అమ‌ర్చారు.  వెనుక‌వైపు 48 మెగాపిక్సెల్స్ మెయిన్‌కెమెరా ఉంది. దీంతోపాటు  8, 2, 2 మెగాపిక్సెల్స్‌తో మ‌రో మూడు కెమెరాలున్నాయి.  ముందు వైపు మ‌రో రెండు కెమెరాల‌ను ఇచ్చింది.

పోర్ట్ర‌యిట్ స్పెష‌లిస్ట్‌
ఏఐ క‌ల‌ర్ పోర్‌్రచయిట్ మోడ్ దీనిలో మ‌రో ప్ర‌త్యేక‌త‌. మీరు తీసిన ఫోటోలో ఆబ్జెక్ట్‌ను బ్యాక్ గ్రౌండ్‌తో వేరు చేయ‌డం ఈ మోడ్‌లో స్పెషాలిటీ. అందుకే ఒప్పో ఎఫ్ 17 ప్రోను పోర్ట్ర‌యిట్ ఎక్స్‌ప‌ర్ట్ అని ఒప్పో చెబుతోంది.

మిడ్ రేంజ్ ఫోనే
స్లీకీ డిజైన్‌, మేట్ ఫినిష్ డిస్‌ప్లే, ఆరు కెమెరాల వంటివి ఉన్నా ఈ ఫోన్ మిడ్ రేంజ్‌దే అని ఒప్పో అంటోంది. అంటే ధ‌ర 15వేల ఆ పైన ఉండొచ్చ‌ని అంచ‌నా. సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ అయ్యాక మిగ‌తా విశేషాలు తెలుస్తాయి. 

జన రంజకమైన వార్తలు