• తాజా వార్తలు

ప్రివ్యూ - ఐఫోన్‌ను మించిన ధ‌ర‌తో ఒప్పో ఫైండ్ ఎక్స్‌2.. ఏంటంత స్పెషల్

ఒప్పో చైనీస్ మొబైల్ కంపెనీ.  మంచి కెమెరా ఫోన్‌. సెల్ఫీల‌ప‌రంగా అయితే కేక పుట్టించే పెర్‌ఫార్మెన్స్‌. ఫోన్ పెర్‌ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. అందుకే వ‌చ్చిన కొద్ది రోజుల్లోనే ఇండియ‌న్ మార్కెట్‌లో మంచి వాటానే కొట్టేసింది.  సాధార‌ణంగా ఒప్పో ఫోన్లు 15 వేల నుంచి  30 వేల రూపాయ‌ల‌లోపు ఉంటాయి. కానీ ఈసారి ఒప్పో ప్రీమియం సెగ్మెంట్‌లో హై ఎండ్‌కు వెళ్లిపోయింది. ఏకంగా  ఐఫోన్ ధ‌ర‌నే బీట్ అవుట్ చేసింది. ఒప్పో ఫైండ్ ఎక్స్‌2 ఫోన్ 12జీబీ ర్యామ్ ధ‌ర 58,590. ఫైండ్ ఎక్స్‌2 ప్రో ధ‌ర 74,890.  ఐఫోన్ 11 కంటే  ఎక్కువ ధ‌ర‌తో వ‌చ్చిన ఈ ఫోన్‌లో అన్ని ప్ర‌త్యేక‌త‌లు ఏమున్నాయో చెప్పే రివ్యూ ఇది..

సూప‌ర్ ఫాస్ట్ ఫోన్‌
ఒప్పో ఫైండ్ ఎక్స్‌2,  ఎక్స్‌2 ప్రో రెండు మోడ‌ల్స్ కూడా మార్చి 6న లాంచ‌య్యాయి.  ఈ రెండు ఫోన్లూ  6.7 అంగుళాల క్యూహెచ్‌డీ ప్ల‌స్ అమౌల్డ్ డిస్‌ప్లేతో వ‌చ్చాయి. దీనికి ముందు వైపు పంచ్ హోల్ కెమెరా వ‌చ్చింది.  

* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ఎస్‌వోసీ చిప్‌సెట్‌తో వ‌చ్చిన ఈ రెండు ఫోన్లూ 5జీతో కూడా ప‌ని చేస్తాయి. 

* 8 జీబీ,  12 జీబీ ర్యామ్‌తో రెండు మోడ‌ల్స్‌ను తీసుకొచ్చింది.  ర్యామ్ హెవీగా ఉండ‌టం, స్నాప్‌డ్రాగ‌న్ 865 లేటెస్ట్ చిప్‌సెట్‌ ఉండ‌టంతో సూప‌ర్ స్పీడ్ పెర్‌ఫార్మెన్స్ ఆశించ‌చ్చు. 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంది. 

ఇంటిలిజెంట్ సిగ్న‌ల్ క్యాచ్ 
ఒప్పో ఫైండ్ ఎక్స్‌2 , ఎక్స్‌2 ప్రోలో  360 డిగ్రీల ఎక్స్‌క్లూజివ్ యాంటెన్నా ఉంది. ఇది యూజ‌ర్ ఫోన్‌ను ఎక్కడ పెట్టినా ఇంటిలిజెంట్‌గా సిగ్న‌ల్ క్యాచ్ చేస్తుంది.  కాబట్టి సిగ్న‌ల్ దొర‌క్క‌పోవ‌డం అనే స‌మ‌స్య‌ను చాలావ‌ర‌కు త‌గ్గించే అవ‌కాశం ఉంది.

కెమెరాలు కేక‌
మామూలుగానే ఒప్పో ఫోన్ కెమెరాలు కేక పుట్టిస్తాయి. ఫైండ్ ఎక్స్ 2 మోడ‌ల్‌లో మూడు కెమెరాలున్నాయి. ఇందులో రెండు 48 మెగాపిక్సెల్‌ సెన్స‌ర్లు . ఇక ఎక్స్ 2 ప్రో మోడ‌ల్‌లో 13 ఎంపీ పెరీస్కోపిక్ కెమెరా ఉంది. ఇది 10 రెట్ల హైబ్రీడ్ జూమ్, 60 రెట్ల డిజిట‌ల్ జూమ్‌ను ఇవ్వ‌గ‌ల‌దు.  ఎలాంటి క్లైమాట్‌లోనైనా సూప‌ర్ క్లారిటీ ఇమేజ్‌లు అత్యంత డెప్త్‌తో తీయడం సాధ్య‌మ‌వుతుంది.   

హెవీ బ్యాట‌రీ, సూప‌ర్ ఫాస్ట్ ఛార్జింగ్ 
ఫైండ్ ఎఫ్‌2, ఫైండ్ ఎక్స్‌2 ప్రో రెండు ఫోన్లూ కూడా 4,200 ఎంఏహెచ్ బ్యాట‌రీతో వ‌చ్చాయి. దాదాపు ఫుల్ డే బ్యాక‌ప్ వ‌స్తుంది. ఇక 65 వాట్స్ సూప‌ర్ వూక్ ఫ్లాష్‌ ఛార్జ్ సపోర్ట్  ఉండ‌టంతో పావుగంట‌లోనే 50% చార్జింగ్ ఎక్కుతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచ‌ర్ కూడా ఇచ్చారు.  
 

జన రంజకమైన వార్తలు