• తాజా వార్తలు

బిగ్ బ్యాట‌రీ, క్వాడ్‌కెమెరా సెట‌ప్‌తో బ‌డ్జెట్ ధ‌ర‌లో రియ‌ల్‌మీ 7ఐ

రియల్‌మీ బ‌డ్జెట్ ఫోన్ల సెగ్మెంట్‌లో  మరో మంచి స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో  లాంచ్ చేసింది.  రియల్‌మీ 7ఐ  పేరుతో వ‌చ్చిన ఈ ఫోన్‌లో భారీ  బ్యాటరీ,  క్వాడ్ రియర్ కెమెరా సెటప్, ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి స్పెషాలిటీస్ ఉన్నాయి.  

రియల్‌మీ 7ఐ  ఫీచర్లు
* 6.5 ఇంచెస్ హెచ్‌డీ పంచ్ హోల్ డిస్‌ప్లే
*  హై రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌
* ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ
* క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్

కెమెరాలు
వెనుక‌వైపు నాలుగు కెమెరాల సెట‌ప్ ఇచ్చారు. ఇందులో మెయిన్ కెమ‌రా 64 మెగాపిక్సెల్స్‌. స‌పోర్ట్‌గా 8, 2, 2 మెగాపిక్సెల్స్‌తో మ‌రో మూడు కెమ‌రాలున్నాయి. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

భారీ బ్యాట‌రీ
రియ‌ల్‌మీ 7ఐలో మ‌రో స్పెషాలిటీ బిగ్ బ్యాట‌రీ. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. దాన్ని ఛార్జ్ చేయ‌డానికి 18 వాట్స్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్
ఉంది

 ధర  
4జీబీ ర్యామ్, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ.11,999
4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ.12,999

అక్టోబ‌ర్ 16 నుంచి సేల్స్‌
అక్టోబరు 16 నుంచి రియల్‌మీ 7ఐ ఫోన్ సేల్స్ ప్రారంభమ‌వుతాయి.

బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ.కామ్‌ల‌లో ఈ ఫోన్ అమ్మ‌కానికి వ‌స్తుంది. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా దొరుకుతుంది.

ఫ్లిప్‌కార్ట్‌ బిలియన్ డేస్‌లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుతో 10శాతం డిస్కౌంట్ పాటు పేటీఎంపై క్యాష్‌బ్యాక్  సదుపాయం కూడా ఉంది.  

జన రంజకమైన వార్తలు