• తాజా వార్తలు

బ‌డ్జెట్ ఫోన్ల పోటీలోకి శాంసంగ్‌.. 10వేల లోపు ధ‌ర‌తో గెలాక్సీ ఎం01ఎస్ విడుద‌ల‌

ఓ ప‌క్క క‌రోనాతో త‌ల్ల‌కిందులైన ఆర్థిక ప‌రిస్థితులు.. మ‌రోవైపు పాడైన స్మార్ట్ ఫోన్లు, డాడీ మాకు ఆన్‌లైన్ క్లాస్‌కు ఫోన్ కావాలంటూ పిల్ల‌ల డిమాండ్లు.. దీంతో ఇప్పుడు స‌గ‌టు జీవులంతా మ‌ళ్లీ స్మార్ట్‌ఫోన్ కొనాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.  ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవ‌డానికి సెల్‌ఫోన్ కంపెనీల‌న్నీ బ‌డ్జెట్ ఫోన్ల‌పై ప‌డ్డాయి. ఇప్ప‌టికే రెడ్‌మీ, రియ‌ల్‌మీ న‌ర్జోలాంటి ఫోన్లు మార్కెట్లో సంద‌డి చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా శాంసంగ్ కూడా బ‌రిలో దూకింది. గెలాక్సీ ఎం01ఎస్ పేరుతో 10వేల లోపు ధ‌ర‌తోనే ఫోన్ రిలీజ్ చేసింది.  


గెలాక్సీ ఎం01ఎస్ ఫీచ‌ర్లు 
* 6.2 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ టీఎఫ్‌టీ స్క్రీన్ .  లేటెస్ట్ మోడ‌ల్ ఇన్ఫినిటి-వి కట్ అవుట్ ఇచ్చి దానిలో సెల్ఫీ కెమెరాను పెట్టింది. 

*మీడియాటెక్ హీలియో పి22 ఆక్టాకోర్ ప్రాసెసర్ 

* 3జీబీ ర్యామ్ 

* 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 512 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ్ చేసుకోవ‌చ్చు. 

* 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 

* ఫింగర్ ప్రింట్ సెన్స‌ర్‌

* ఫేస్ రిక‌గ్నైజేష‌న్ ఫీచ‌ర్ 

కెమెరాలు
13 ఎంపీ,. 2ఎంపీతో కూడిన రియర్ డ్యూయల్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ముందు 8 ఎంపీ  కెమెరా ఉంది. 

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ ల‌భ్యం
* ధ‌ర‌: 9,990 రూపాయ‌లు
*ఈకామర్స్ వెబ్‌సైట్లతోపాటు శాంసంగ్ అఫీషియ‌ల్  స్టోర్‌లోనూ దొరుకుతుంది.
* ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంది.   


 

జన రంజకమైన వార్తలు