• తాజా వార్తలు

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ యాప్.. సందేశ్ !ఏంటి దీని విశేషాలు ?

వాట్సాప్, ప్రైవసీ పాలసీ ప్రపంచమంతా విమర్శలను ఎదుర్కొంటోంది. చాలా దేశాలు సొంత మెస్సేజింగ్ యాప్స్ తయారు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వాట్సాప్, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా భారత ప్రభుత్వం సందేశ్ యాప్‌ను డెవలప్  చేసింది.  దీన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) తాజాగా ప్రారంభించింది.  జిమ్స్ ను అప్ గ్రేడ్ చేశారు   ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం అభివృద్ధి చేసిన గవర్నమెంట్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సిస్టమ్‌ (GIMS)ను అప్‌గ్రేడ్ చేసి సందేశ్‌ యాప్‌ను రూపొందించారు. ఇప్పుడు ఇది ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలందరికి కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.  

ఎలా పని చేస్తుంది?                  

*ఇతర మెసేజింగ్ యాప్‌ల మాదిరిగానే సందేశ్‌ యాప్‌లో చాట్ లిస్ట్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్‌లో ఉన్నవారికి మెసేజ్‌లు పంపవచ్చు.

 * గ్రూప్ చాట్ చేసుకోవచ్చు.              

 * ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు.

 *మల్టీమీడియా కంటెంట్‌తో పాటు కాంటాక్ట్స్ షేరింగ్ ఆప్షన్‌ కూడా ఉంది.


ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ..


ఆండ్రాయిడ్ యూజర్లు GIMS పోర్టల్ ద్వారా సందేశ్‌ యాప్ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ 5.0, ఆ తరువాత వచ్చిన ఆండ్రాయిడ్ డివైజ్‌లలో పనిచేస్తుంది.  ఐఓఎస్ వినియోగదారులు  యాప్‌ స్టోర్‌ నేరుగా సందేశ్ ‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వాడుకోవచ్చు. ఐఓఎస్ 12.0తో పనిచేసే యాపిల్ ప్రొడక్ట్స్ లో సందేశ్ యాప్ పనిచేస్తుంది.

జన రంజకమైన వార్తలు