• తాజా వార్తలు

సెప్టెంబర్ 15న యాపిల్ ఈవెంట్‌... ఏమేం లాంచ్ చేయ‌బోతుందంటే?

టెక్నాల‌జీ లెజెండ్ యాపిల్.. త‌న యాన్యువ‌ల్ ఈవెంట్‌కు రంగం సిద్ధం చేసింది. క‌రోనా నేప‌థ్యంలో ఈసారి ఆన్‌లైన్‌లోనే ఈవెంట్‌ను నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించింది. టైమ్ ఫ్లైస్ పేరుతో ఈ నెల సెప్టెంబర్ 15న నిర్వ‌హించ‌బోతున్నీ ఈ మెగా ఈవెంట్‌ను యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో,  యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు.  

ఏమేం లాంచ్ చేస్తోంది?  వాటి విశేషాలేంటి? 
5జీ ఫోన్‌

 సరికొత్త కెమెరాతో 5జీ ఫోన్‌ను తీసుకురాబోతోంది. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ముందు అనుకున్న‌ట్లుగా ఐఫోన్ 12 సిరీస్‌ను ఈ ఈవెంట్‌లో లాంచ్ చేయ‌డం అనుమానమే అని టాక్‌.  ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్‌లను రిలీజ్ చేయాల‌ని అనుకున్నా అది అక్టోబ‌ర్‌కు వాయిదా ప‌డ‌వ‌చ్చ‌ని స‌మాచారంగా ఉంది. ఒక‌వేళ ఐఫోన్ 12 సిరీస్‌ను ఈ ఈవెంట్లో లాంచ్ చేయ‌క‌పోతే వాటి గురించి కొంత స‌మాచారం చెప్పే అవ‌కాశం ఉంది. 

యాపిల్ వాచ్ సిరీస్ 6 
యాపిల్ వాచ్ 5 సిరీస్ కంటే దీనిలో మ‌రిన్ని ఎక్కువ హెల్త్ ఫీచ‌ర్లు ఉండబోతున్నాయి. కొవిడ్ నేప‌థ్యంలో బ్లడ్ ఆక్సిజన్ మానిటర్‌ను కూడా వాచ్‌లో అమ‌ర్చ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతోపాటు స్లీప్ ట్రాకింగ్, ఇంప్రూవ్ ఈసీజీ లాంటి కొత్త ఫీచర్లతో వస్తుంది.  స్మార్ట్ వాచ్‌ల మార్కెట్లో విప‌రీత‌మైన పోటీ నెల‌కొన్న ప‌రిస్థితుల్లో యాపిల్ వాచ్ సిరీస్ 6ను కాస్త అందుబాటు ధ‌ర‌లో తీసుకురావ‌చ్చ‌ని మార్కెట్ అంచ‌నా. 

కొత్త ఐప్యాడ్ ఎయిర్  
యాపిల్  ఈ  ఈవెంట్లోనే కొత్త ఐప్యాడ్‌ను కూడా లాంచ్ చేయ‌బోతోంది. ఫాస్టెస్ట్ ప్రాసెసర్, థిన్ బీజెల్స్ డిస్‌ప్లే ఉండొచ్చు. 


 

జన రంజకమైన వార్తలు