• తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించ‌డానికి గూగుల్ తెస్తోంది టాస్క్‌మేట్స్ యాప్

టెక్నాల‌జీ లెజెండ్ కంపెనీ గూగుల్ నుంచి మరో కొత్త యాప్ రాబోతుంది. అయితే ఇదేమీ ఆషామాషీ యాప్ కాదు. ఊరికే కాల‌క్షేపానికి ప‌నికొచ్చేది కాదు.  యూజ‌ర్ల‌కు ఆన్‌లైన్‌లో చిన్న చిన్న టాస్క్‌ల‌తో  డ‌బ్బులు సంపాదించిపెట్టే కామ‌ధేనువు.  గూగుల్ టాస్క్స్ మేట్ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్‌లో  చిన్న చిన్న  పనులు చేయడం ద్వారా డ‌బ్బులు సంపాదించుకోవ‌‌చ్చు.  దీని క‌థేంటో చూసేద్దాం ప‌దండి

ఎలా సంపాదించ‌వ‌చ్చు? 
గూగుల్ టాస్క్‌మేట్స్ యాప్‌లో డ‌బ్బులు సంపాదించ‌డానికి రెండు ర‌కాల మార్గాలున్నాయి. అవి  సిట్టింగ్ టాస్క్ ,  ఫీల్డ్ టాస్క్ ఉదాహరణకు ఫీల్డ్ టాస్క్ అంటే మీకు ద‌గ్గ‌ర‌లోని రెస్టారెంట్ కాఫీషాప్ లాంటివి  ఫోటో తీసి ఆ రెస్టారెంట్‌కు సంబంధించి మీరు బాగా ఏమి ఇష్ట‌ప‌డ‌తారు?   అక్క‌డ మీకేం కావాల‌నుకుంటున్నారు లాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానిలివ్వాలి.  
* సిట్టింగ్ టాస్క్ అంటే ఏదైనా ప్రొడ‌క్ట్ రివ్యూలు లేదా టాపిక్‌ల‌ను ఇంగ్లీష్ నుంచి మీ సొంత భాష‌లోకి ట్రాన్స్‌లేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే  ట్రాన్స్‌స్క్రైబింగ్ చేయాల్సి రావ‌చ్చు.   
* ఈ టాస్క్‌లు పూర్తి చేసినందుకు మీకు డబ్బును ఇ-వాలెట్‌కు రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం లేదా ఇన్‌-యాప్ పేమెంట్ పార్ట్‌న‌ర్ ద్వారా గూగుల్ చెల్లిస్తుంది.  

ఎప్పుడొస్తుంది?
ప్ర‌స్తుతం గూగుల్ టాస్క్ యాప్  బీటా టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి యాప్ అందుబాటులో ఉంది. అయితే  రిఫెరల్ కోడ్ ఉంటే తప్ప దాన్ని ఉపయోగించలేరు. ప్ర‌స్త‌తం సెలెక్టెడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే టెస్టింగ్ కోసం  రిఫ‌ర‌ల్ కోడ్  పంపిస్తోంది. త్వ‌ర‌లో యాప్ అఫీషియ‌ల్‌గా లాంచ్ అవుతుంది కాబ‌ట్టి అప్పుడు  అంద‌రికీ అందుబాటులోకి వ‌స్తుంది.

జన రంజకమైన వార్తలు