• తాజా వార్తలు

2022 లో కెమెరా ఫోన్లు ఎలా ఉంటాయి ? ఏ కొత్త ఫీచర్స్ వస్తాయి

2021 ఏడాది దాదాపు పూర్త‌యిపోయింది.  ఈ ఏడాది ఆస‌క్తిక‌ర‌మైన కెమెరా ఫోన్లు మార్కెట్‌లోకి వ‌చ్చాయి. 108 ఎంపీ కెమెరాలు, ఆస్ట్రో ఫొటోగ్రాఫీ మోడ్ లాంటి ఫీచ‌ర్లు ఉన్న ఫోన్ల‌ను కూడా మ‌నం చూశాం. మ‌రి 2022 ఏడాది ఎలాంటి ఫోన్ల‌ను ప‌రిచ‌యం చేయ‌బోతోంది. వ‌చ్చే సంవ‌త్స‌రం మ‌నం స్మార్ట్ ఫోన్ కెమెరాలు ఎలా ఉండాల‌ని ఆశిస్తున్నాం!

సినిమోటిక్ మోడ్‌
ఐఫోన్‌-13 సిరీస్ వేగంగా అమ్ముడుపోవ‌డానికి కార‌ణ‌మైన ఫీచ‌ర్ల‌లో ఒక‌టి సినిమోటిక్ మోడ్‌. ఇది ఓ స్మార్ట‌ర్ పోట్రాయిటిక్ వీడియో మోడ్‌. పొట్రాయిటిక్ వీడియో మోడ్ మ‌న‌కేం కొత్త కాదు. గ‌తంలో హువీయ్, శాంసంగ్ లాంటి ఫోన్ల‌లో ఇప్ప‌టికే ఈ ఫీచ‌ర్‌ను చూశాం. అయితే యాపిల్ దీన్ని కొత్త‌గా మార్చింది. సినిమోటిక్ మోడ్‌తో పాటు ఆటోమెటిక్ ఫోక‌సింగ్ దీనితో చేర్చారు. అందుకే వ‌చ్చే ఏడాది క‌చ్చితంగా సినిమోటిక్ మోడ్ ఉన్న ఫోన్ల‌కు గిరాకీ బాగా పెర‌గ‌నుంది. ఈ రేసులో ఐఫోన్ చాలా ముందుంది.

మ‌ళ్లీ ఆర్‌జీబీడబ్ల్యూ కెమెరాలు
2015లోనే ఆర్‌జీబీడబ్ల్యూ కెమెరాలను స్మార్ట్‌ఫోన్ల‌లో చూసేశాం. హువీయ్ పీ8 లాంటి స్మార్ట్‌ఫోన్లు వీటిని మ‌న‌కు ప‌రిచ‌యం చేశాయి. 2015, 2018లో ఒప్పో కూడా ఆర్‌జీబీడబ్ల్యూ కెమెరాలను త‌మ ఫోన్ల‌లో ప్ర‌యోగాత్మ‌కంగా క‌స్ట‌మ‌ర్ల‌కు అందించింది. క‌న్వేన్ష‌న‌ల్ కెమెరా సెన్స‌ర్ల‌లో క‌ల‌ర్ ఫిల్ట‌ర్లు ఉంటాయి. అలాగే ఆర్‌జీబీడబ్ల్యూ కెమెరా సెన్సార్ల‌లో వైట్ స‌బ్ పిక్స‌ల్స్ ద్వారా మిక్స్ చేసే ఆప్ష‌న్ ఉంటుంది. దీని వ‌ల్ల లైటింగ్ బ్యాలెన్స్ బెట‌ర్‌గా క‌నిపిస్తుంది.

స్టెబిలైజేష‌న్‌
ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ అనే ఆప్ష‌న్ హై ఎండ్ స్మార్ట్ ఫోన్ల‌లో త‌ప్ప‌ని స‌రి అయిపోయింది. లూమియా 920 డివైజ్‌ల నుంచి కూడా ఇది ఉంది.అయితే  వ‌చ్చే సంవ‌త్స‌రంలో ఈ స్టెబిలైజేష‌న్ మ‌రింత అప్డెట్‌గా రానుంది. వివో కంపెనీ మైక్రో గింబాల్ స్టెబిలైజేష‌న్‌, యాపిల్‌.. సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేష‌న్ తీసుకొస్తున్నాయి.

వేరిబుల్ టెలిఫోటో
ఈ ఏడాది సోని కంపెనీ తీసుకొచ్చిన ఆప్ష‌న్ల‌లో వేరిబుల్ టెలిఫొటో కెమెరా ఒక‌టి. సోనీ ఎక్స్‌పీరియా 1 111, 5 111 మోడ‌ల్స్‌లో ఈ ఆప్ష‌న్ ఉంది. మీకు జూమ్ బాగా ఉండాలంటే రెండు ప్ర‌త్యేక‌మైన టెలిఫొటో కెమెరాలు అక్క‌ర‌లేకుండా వేరిబుల్ టెలిఫొటో ఉప‌యోగ‌ప‌డుతుంది.  రాబోయే ఏడాదిలో మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాట‌లో ఉన్నాయి.

8కే వీడియోలు
2019 నుంచి ఫోన్ల‌లో 8 కె వీడియోలు అందుబాటులో ఉన్నాయి.  కానీ అవి అంత విజ‌య‌వంతం కాలేదు. అయితే 2020 నుంచి ఈ ఆప్ష‌న్ మ‌రింత మెరుగ‌వుతూ వ‌చ్చింది. స్నాప్‌డ్రాగ‌న్ 865 సిరీస్ చిప్ సెట్ల‌లో 8కే.. 30 ఎఫ్‌పీఎస్ స‌పోర్ట్ ల‌భిస్తుంది. ఈ ఏడాది కొన్ని ఫోన్లు  ఈ ఆప్ష‌న్ ఇచ్చాయ‌. వ‌చ్చే ఏడాది మ‌రిన్ని ఫోన్ల‌లో మ‌నం ఈ స‌దుపాయాన్ని పొందొచ్చు.

ఆబ్టెక్ట్ ఎరేజింగ్‌
గూగుల్ పిక్స‌ల్ 6 ఫోన్ల‌లో ఈ ఆప్ష‌న్ రోల్ ఔట్ అయింది. శాంసంగ్‌, హువీయ్ కూడా ఇదే బాట‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల ఒక ఫొటోను మీరు ఎడిట్ చేసుకోవ‌చ్చు. అంటే బ్ల‌రింగ్‌, లేదా ఫొటో బంబ‌ర్స్‌, లేదా ఏదైనా స్పెసిఫిక్ ఐట‌మ్ ఎరేజ్ చేయ‌డం లాంటి ప‌నుల‌ను మీరే చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
 

జన రంజకమైన వార్తలు