• తాజా వార్తలు

లాక్‌డౌన్ మ‌నోళ్ల గూగుల్ సెర్చింగ్ ట్రెండ్‌ను ఎలా మార్చిందంటే..

ప్ర‌తి సంక్షోభం మ‌నకు కొత్త విష‌యాల‌ను ప‌రిచయం చేస్తుంది. క‌రోనా వైర‌స్‌, దాన్ని నియంత్రించ‌డానికి గ‌వ‌ర్న‌మెంట్ పెట్టిన లాక్‌డౌన్ కూడా మ‌న‌జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్రత నేర్పింది. అవస‌రం లేక‌పోయినా బ‌య‌ట తిర‌గ‌డానికి చెక్‌పెట్టింది. ఆఖ‌రికి మ‌నం గూగుల్‌లో సెర్చ్ చేసే విష‌యాల్లో కూడా కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. అవేంటో గూగుల్ బ‌య‌ట‌పెట్టింది.

నియ‌ర్‌మీ
మన‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న దుకాణాల గురించి ఎక్కువ‌మంది సెర్చ్ చేశార‌ట‌. సాధారణం కంటే ఇవి ఎన్ని వంద‌ల రెట్లో పెరిగాయి.
ఫార్మ‌సీ నియ‌ర్‌మీ సెర్చ్ అనేది 58% పెరిగింది.
గ్రాస‌రీ డెలివ‌రీ నియ‌ర్ మీ ఏకంగా 550 శాతం పెరిగింది. 
రేష‌న్ దుకాణ్ నియ‌ర్‌మీ 300%
డాక్ట‌ర్ నియ‌ర్ మీ సెర్చ్ 60%  పెరిగాయి .

వ్యాయామం, వంట‌లు 
జిమ్ ఎట్ హోం 93%
5 మినిట్స్ రెసిపీస్ 56%
మెషీన్ లెర్నింగ్‌, డేటా సైన్స్ సెర్చింగ్స్ 3 రెట్లు పెరిగాయి
లెర్న్ ఆన్‌లైన్  85%
టెక్ ఆన్‌లైన్ 148%
ఎట్ హోం లెర్నింగ్ 78% పెరిగాయి. 

ఇమ్యూనిటీ బూస్ట‌ర్ 
విట‌మిన్ సీ సెర్చ్ 150%
ఆయుర్వేదిక్ హోం రెమిడీస్ 380%
ఇమ్యూనిటీ సెర్చ్ 500% పెరిగాయి.

ఆన్‌లైన్ బిల్ పేమెంట్స్ సెర్చ్‌లు 180% పెరిగాయ‌ట‌. అలాగే ఫైనాన్షియ‌ల్ టిప్స్ గురించి కూడా చాలా ఎక్కువ‌మంది వెతికారు. 
 

జన రంజకమైన వార్తలు