• తాజా వార్తలు

రివ్యూ - జియో వ‌ర్సెస్ ఎయిర్‌టెల్‌..  డైలీ 3జీబీ డేటా ప్లాన్స్  ఏది బెస్ట్ ?

లాక్‌డౌన్ టైమ్‌లో వ‌ర్క్‌ఫ్రం హోమ్ చేసేవాళ్లు పెరిగారు. వీరితోపాటు మిగిలిన‌వారికి కూడా ఇంట్లో ఉండి ఎక్కువ‌సేపు మొబైల్ చూస్తుండ‌టంతో డేటా ఎక్కువ అవ‌స‌రం అవుతోంది. ఈ ప‌రిస్థితుల్లో దాదాపు పెద్ద టెలికం కంపెనీల‌న్నీ రోజువారీ డేటాను ఎక్కువ ఆఫర్ చేస్తున్నాయి. ఇక ఇండియ‌న్ టెలికం ఇండ‌స్ట్రీలో నువ్వా నేనా అని పోటీప‌డుతున్న జియో, ఎయిర్‌టెల్ కూడా రోజూ 3జీబీ డేటా ప్లాన్స్‌లో సై అంటే సై అంటున్నాయి. ఇంత‌కీ ఈ రెండు ప్లాన్స్‌లో ఏవి బెట‌ర్‌.. మీరే చూడండి.  

జియో 3జీబీ డేటా ప్లాన్స్ 
జియోలో రోజుకు 3జీబీ డేటా ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్స్ రెండు ఉన్నాయి.

జియో 349  ప్లాన్ 
ధ‌ర‌: 349 రూపాయ‌లు
వాలిడిటీ: 28 రోజులు
డేటా:  రోజూ 3జీబీ 
కాల్స్:  జియో టు జియో అన్‌లిమిటెడ్ ఫ్రీకాల్స్‌, ఇతర నెట్‌వ‌ర్క్‌ల‌కు 1000 నిముషాల ఫ్రీ కాల్స్‌
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ
జియో యాప్స్ అన్నీ ఫ్రీగా వాడుకోవ‌చ్చు. 
 
జియో 999 ప్లాన్ 
ధ‌ర‌: 999 రూపాయ‌లు 
వాలిడిటీ: 84 రోజులు
డేటా:  రోజూ 3జీబీ చొప్పున మొత్తం 252 జీబీ డేటీ ఫ్రీ
కాల్స్:  జియో టు జియో అన్‌లిమిటెడ్ ఫ్రీకాల్స్‌, ఇతర నెట్‌వ‌ర్క్‌ల‌కు 3000 నిముషాల ఫ్రీ కాల్స్‌
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ
జియో యాప్స్ అన్నీ ఫ్రీగా వాడుకోవ‌చ్చు. 


ఎయిర్‌టెల్ 3జీబీ డేటా ప్లాన్స్ 
ఎయిర్‌టెల్‌లో కూడా  రోజుకు 3జీబీ డేటా ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్స్ రెండు ఉన్నాయి.

ఎయిర్‌టెల్ 401  ప్లాన్ 
ధ‌ర‌: 401 రూపాయ‌లు
వాలిడిటీ: 28 రోజులు
డేటా:  రోజూ 3జీబీ 
కాల్స్:   ఏ నెట్‌వ‌ర్క్‌కైనా అన్‌లిమిటెడ్ ఫ్రీకాల్స్ 
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ
డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ 
 
ఎయిర్‌టెల్ 558 ప్లాన్ 
ధ‌ర‌: 558 రూపాయ‌లు
వాలిడిటీ: 56 రోజులు
డేటా:  రోజూ 3జీబీ 
కాల్స్:   ఏ నెట్‌వ‌ర్క్‌కైనా అన్‌లిమిటెడ్ ఫ్రీకాల్స్ 
రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ
డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ 
జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ
మొబైల్ యాంటీవైర‌స్ ఫ్రీ. 

జన రంజకమైన వార్తలు