• తాజా వార్తలు

ఈ వారం టెక్ రౌండ‌ప్‌..

టెక్నాల‌జీ సెక్టార్‌లో ప్ర‌తి రోజూ ఎన్నో కొత్త కొత్త అప్‌డేట్స్ వ‌స్తుంటాయి. కంపెనీలు కొత్త ప్లాన్స్‌, స్కీమ్స్‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను త‌మ ప్రొడ‌క్ట్ కొనేలా చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాయి. ఆర్థిక వ‌న‌రులు పెంచుకోవ‌డానికి, సంస్థ‌ను ప‌టిష్టంగా మార్చుకోవ‌డానికి ప్రణాళిక‌లు వేస్తుంటాయి. ఇలాంటి  ర‌క‌ర‌కాల అప్‌డేట్స్‌తో ఈ వారం టెక్ రౌండ‌ప్ మీకోసం..

న్యూస్ ఫీడ్‌లో ట్రెండింగ్ ఫీచ‌ర్ తొల‌గించిన ఫేస్‌బుక్‌
ఫేస్‌బుక్ త‌న న్యూస్‌ఫీడ్ నుంచి ట్రెండింగ్ అనే ఫీచ‌ర్‌ను తొల‌గించింది. న్యూస్‌లో ట్రెండింగ్ అంటూ ఫేస్‌బుక్ చెప్పినా దాన్ని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఫేస్‌బుక్ చేయించిన ఓ రీసెర్చి ప్ర‌కారం ట్రెండింగ్ ట్యాబ్ నుంచి రెండు శాతం  క్లిక్స్ కూడా రావ‌డం లేద‌ని గుర్తించింది. అందుకే ఈ ఫీచ‌ర్‌ను తొల‌గించ‌బోతున్న‌ట్లు బ్లాగ్‌లో ప్ర‌క‌టించింది.

100% ఎఫ్‌డీఐకి ఐడియాకు అనుమ‌తి 
ఐడియా సెల్యుల‌ర్ లిమిటెడ్ 100 శాతం విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు (FDI) తీసుకోవ‌డానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలి క‌మ్యూనికేష‌న్స్ అనుమ‌తిచ్చింది.  ఇప్ప‌టికే  ఐడియా సెల్యుల‌ర్‌కు 65% ఎఫ్‌డీఐ తీసుకోవ‌డానికి అనుమ‌తి ఉంది. దాన్ని 100 శాతానికి పెంచుతూ డీవోటీ అనుమ‌తులు జారీ చేసింది. ఇప్ప‌టికే వొడాఫోన్‌- ఐడియా మెర్జ‌ర్‌కు సెబీ, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, సీసీఐ వంటి సంస్థ‌ల‌న్నీ ప‌ర్మిష‌న్లు ఇచ్చిన ప‌రిస్థితుల్లో ఎఫ్‌డీఐ లిమిట్ కూడా పెంచ‌డం ఐడియాకి శుభ‌వార్తే.

ఫేస్‌బుక్‌పై యాపిల్ విమ‌ర్శ‌లు
కేంబ్రిడ్జి అన‌లిటికా డేటా లీకేజి స్కామ్‌తో అభాసుపాల‌యిన ఫేస్‌బుక్‌పై యాపిల్ విమ‌ర్శ‌లు చేసింది.లైక్, షేర్ బ‌ట‌న్స్‌తో యూజ‌ర్ల డేటాను దుర్వినియోగ‌ప‌రుస్తున్నారంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఫేస్‌బుక్ మీద కామెంట్స్‌చేసింది. జూన్ 5న ప్రారంభ‌మైన యాపిల్ వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో యాపిల్ ఈ కామెంట్స్‌చేసింది. దీనితో పాటు డిజిట‌ల్ ఎడిక్ష‌న్ త‌గ్గించ‌డం, త‌న వాయిస్ అసిస్టెంట్ సిరిని డెవ‌ల‌ప్ చేయ‌డంపై ఈ కాన్ఫ‌రెన్స్‌లో యాపిల్ దృష్టిసారించింది.

అంచ‌నాలు మించిన స‌రిగ‌మ‌
ఆడియో క్యాసెట్లు, టేప్ రికార్డ‌ర్ల‌కు ఎప్పుడో కాలం చెల్లిపోయింది.  పెన్‌డ్రైవ్‌లు పాపుల‌రయి, ఇంట‌ర్నెట్ రేట్లు త‌గ్గిపోయాక సీడీ ప్లేయ‌ర్ల‌ను వాడుతున్న‌వాళ్లూ లేరు. కానీ స‌రిగ‌మ సంస్థ కార్వాన్ పేరుతో రిలీజ్ చేసిన ఫిజిక‌ల్ మ్యూజిక్ ప్లేయ‌ర్‌కి మాత్రం ఊహించ‌నంత రెస్పాన్స్ ల‌భించింది. ఏకంగా ఇప్ప‌టివ‌ర‌కు 3,89,000 యూనిట్లు అమ్మి స‌రిగ‌మ అంచ‌నాల‌ను దాటేసింది.

జ‌స్ట్ డ‌య‌ల్ లాభం రూ.39 కోట్లు
ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్‌తో బాగా పాపుల‌ర‌యిన జ‌స్ట్ డ‌య‌ల్ లాభాల బాట‌లో న‌డుస్తోంది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి జ‌స్ట్ డ‌య‌ల్ రూ.39 కోట్ల నిక‌ర లాభం సంపాదించింది. ఆప‌రేటింగ్ రెవెన్యూ 200 కోట్ల రూపాయ‌లు దాటింద‌ని, ఇది గ‌తేడాదితో కంపేర్ చేస్తే 10% ఎక్కువ‌ని సంస్థ ప్ర‌క‌టించింది.

ఓట‌ర్స్ లిస్ట్‌కి క్యాప్చా కోడ్‌
వెబ్‌సైట్స్‌లోకి ఎంట‌ర‌వ‌డానికి వాడే క్యాప్చా కాడ్‌ను ఓట‌ర్స్ లిస్ట్‌కీ వాడాల‌ని ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నిక‌ల అధికారుల‌ను ఆదేశించింది. ఓట‌ర్ రోల్స్‌ను టెక్స్ట్ రూపంలో కాకుండా ఇమేజ్ రూపంలో ఉంచితే ఓట‌ర్ల వ్య‌క్తిగ‌త స‌మాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుంద‌ని ఈసీ భావిస్తోంది. అందుకే క్యాప్చా పెట్టాల‌ని ఆర్డ‌ర్స్ పాస్ చేసింది.

ఆధార్ అప్‌డేట్ హిస్ట‌రీ డౌన్‌లోడ్ చేసుకోండి
మీ ఆధార్ కార్డ్ డేటాను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకుంటున్నారా? అయితే  ఏ మార్పులు చేశారో ఆ హిస్ట‌రీ మొత్తం కావాలంటే మీరు ఇక‌పై డౌన్‌లోడ్ కూడా చేసుకోవ‌చ్చు. UIDAI వెబ్‌సైట్ నుంచి మీ ఆధార్ అప్‌డేట్ హిస్ట‌రీని డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన‌ట్లు సంస్థ సీఈవో అజ‌య్ భూష‌ణ్ పాండే ప్ర‌క‌టించారు.

ఫేస్‌బుక్‌కు నోటీసులు పంపిన కేంద్ర ప్ర‌భుత్వం
త‌న యూజ‌ర్ల స‌మాచారాన్ని ఫేస్‌బుక్‌.. మొబైల్ త‌యారీదారుల‌కు షేర్ చేస్తుంద‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి.  దీనిపై స‌మాధానాం చెప్పాల‌ని  కేంద్ర ప్ర‌భుత్వం ఫేస్‌బుక్‌కు నోటీసులు పంపించింది. జూన్ 20వ తేదీలోగా ఈ నోటీసుల‌కు ఫేస్‌బుక్ స‌మాధానం పంపాల్సి ఉంటుంది.

400 రైల్వేస్టేష‌న్లలో వైఫై.. గోల్ రీచ్ అయిన గూగుల్‌
గూగుల్ స్టేష‌న్ పేరుతో ఇండియాలోని 400 రైల్వేష్టేష‌న్ల‌లో ఫ్రీ వైఫై హాట్‌స్పాట్‌ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని గూగుల్‌.. ఇండియ‌న్ రైల్వేస్‌, ఐఎస్‌పీ రైల్‌టెల్‌తో 2015లో ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్ల‌లో గూగుల్ ఈ లక్ష్యాన్ని చేరుకుంది. గూగుల్ ప్ర‌తినిధి కాస‌ర్‌సేన్ గుప్తా గురువారం ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

జన రంజకమైన వార్తలు