• తాజా వార్తలు

రివ్యూ - అన్ని కంపెనీల 2జీబీ డేటా ప్లాన్లలో బెస్ట్ ఏది?

ఇప్పుడంతా డేటా వార్ న‌డుస్తోంది. . ఏ కంపెనీ చీప్ అండ్ బెస్ట్‌గా డేటా ఇస్తే వినియోగ‌దారులు కూడా ఆ కంపెనీ వెన‌కే వెళుతున్నారు. జియో దెబ్బ‌కు మిగిలిన టెలికాం కంపెనీలు కూడా దిగొచ్చాయి. అవి కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కే డేటాను ఇస్తున్నాయి. అందులోనూ 2జీబీ డేటా విష‌యంలో జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా లాంటి బ‌డా కంపెనీల మ‌ధ్య పెద్ద ఎత్తున పోటీ ఉంది.  మ‌రి ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న 2జీబీ డేటాలో బెస్ట్ ఇస్తున్న కంపెనీ ఏది? ఏది ఉత్త‌మ‌మైన ప్లాన్‌?

జియో 249 ప్లాన్‌
జియోలో డైలీ డేటా ప్లాన్ రూ.249 నుంచి ఆరంభం అవుతోంది. ఇది 28 రోజుల‌కు రోజుకు 2 జీబీ చొప్పున ఆఫ‌ర్ చేస్తోంది. దీని వ‌ల్ల మీరు మొత్తం 56 జీబీ డేటాను 28 రోజుల చొప్పున పొందొచ్చు. దీనికి తోడు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితంగా కూడా చేసుకోవ‌చ్చు. ఈ ప్లాన్‌లో మీకు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా ల‌భిస్తాయి. 

జియో 444 ప్లాన్‌
జియోలో ఉన్న రెండో ప్లాన్ ఇది. రోజుకు 2 జీబీ డేటా చొప్పున 56 రోజుల పాటు మ‌న‌కు ఈ ప్లాన్ వ‌ర్తిస్తుంది. మొత్తం మీకు 112 జీబీ 56 రోజుల‌కు వ‌స్తుంది. ఇంతేకాక జియో టు జియో వాయిస్ కాల్స్ ఉచితం. 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు బోన‌స్‌గా ల‌భిస్తాయి. ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 2000 నాన్ జియో మినిట్స్ ల‌భిస్తాయి. 

జియో 555 ప్లాన్‌
ఇందులో మీకు 2జీబీ డేటా 84 రోజుల పాటు ల‌భిస్తుంది. దీని వ‌ల్ల మీరు 28 రోజుల పాటు 168 జీబీ పొందొచ్చు. అంతేకాక జియో టు జియో ఉచిత కాల్స్ ఉంటాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితంగా ల‌భిస్తాయి. నాన్ జియో క‌స్ట‌మ‌ర్లకు ఫోన్ చేయాలంటే 3000 నాన్ జియో మినిట్స్ ల‌భిస్తాయి. 3000 నిమిషాల‌కు మించి మాట్లాడితే ఛార్జీలు వ‌ర్తిస్తాయి.

ఎయిర్‌టెల్ 298 ప్లాన్‌
భార‌తి ఎయిర్‌టెల్ 2జీబీ ప్లాన్‌లో ముఖ్య‌మైంది రూ.298 ప్లాన్‌.. దీనిలో రోజుకు 2జీబీ చొప్పున 28 రోజుల పాటు ప్లాన్ వ‌స్తుంది. దీని ద్వారా మొత్తంగా 56 జీబీ పొందొచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. వాయిస్ కాలిలంగ్ కూడా అన్‌లిమిటెడ్‌. ఎయిర్‌టెల్ 2జీబీ ప్లాన్‌లో ఎఫ్‌యూపీ లేదు. ఇత‌ర ఆప‌రేటర్ల‌కు కూడా 28 రోజుల పాటు ఉచితంగా కాలింగ్ పొందొచ్చు.

ఎయిర్‌టెల్ 349 ప్లాన్‌ 
అమేజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ద్వారా ఈ ప్లాన్ ఉచితంగా పొందొచ్చు. రూ.298 మాదిరిగానే దీనిలో కూడా  సేమ్ బెనిఫిట్స్ పొందొచ్చు. రోజుకు 2 జీబీ చొప్పున 28 రోజుల వ్య‌వ‌ధికి అందిస్తోంది. ఇలా మొత్తం 56 జీబీ డేటా పొందొచ్చు. 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా కూడా వాడుకోవ‌చ్చు.  అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మ‌రో ఆప్ష‌న్‌. దీనికి ఎఫ్‌యూపీ లేదు.

వొడాఫోన్ ఐడియా 299 ప్లాన్‌
2జీబీ ప్లాన్ల‌లో మ‌రో ఉత్త‌మైన‌ది వొడాఫోన్ రూ.299 ప్లాన్. ఈ వొడాఫోన్‌-ఐడియా ప్లాన్ ద్వారా రోజుకు 2 జీబీ డేటా ద్వారా 28 రోజుల పాటు ప్లాన్ వ‌ర్తిస్తుంది. ఈ ప్లాన్ మొత్తం మీద 56 జీబీ డేటాను అందిస్తోంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం. అన్‌లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంది. ఎఫ్‌యూపీ లేదు.

వొడాఫోన్ ఐడియా 499 ప్లాన్‌
వొడాఫోన్ ఐడియా ప్లాన్‌లో మ‌రో 2జీబీ ప్లాన్ రూ.499. ఇది 56 రోజుల పీరియ‌డ్‌కు వ‌ర్తిస్తుంది. మొత్తం 112 జీబీ డేటా దీనిలో ల‌భిస్తుంది. 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితంగా ల‌భిస్తాయి వాయిస్ కాలింగ్ కూడా  ఉచితం. వొడాఫోన్ ఐడియా 2జీబీ ప్లాన్‌కు ఎలాంటి ఎఫ్‌యూపీ లేదు.  

జన రంజకమైన వార్తలు