• తాజా వార్తలు

రివ్యూ-43 ఇంచుల ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ ప్రో

చైనా దిగ్గజం షియోమీ....మరో సంచలనానికి నాంది పలికింది. ఇప్పటివరకు మార్కెట్లో ఎంఐ స్మార్ట్ ఫోన్లతో అదరగొట్టిన షియోమీ...ఇప్పుడు ఎంఐ ఎల్ఈడి టీవీలను రిలీజ్ చేసింది. ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ ప్రో 43 ఇంచుల డిస్ ప్లే సైజ్ గల సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని ఇండియా మార్కట్లోకి విడుదల చేసింది. దీని ఫీచర్లు అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. దీని ధర 23వేలుగా నిర్ణయించింది. ఒకవేళ మీరు ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఏ ప్రోను కొనుగోలు చేయాలనుకుంటే....వీటి గురించి తెలుసుకోండి. 

డిజైను....
షియోమీ స్మార్ట్ ఫోన్ మాదిరిగానే....ఎంఐ టీవీలు కూడా యూజర్లను ఆకట్టకుంటున్నాయి అని చెప్పడానికి ఉదాహరణ ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ ప్రో. ఈ స్మార్ట్ టీవీ సన్నని బెజ్జెల్లను కలిగి ఉంది. డిస్ ప్లే ఎంతగానో ఆకట్టుకోనుంది. ఈ టీవీ స్క్రీన్ చాలా మందంగా ఉంటుంది. ఇదే ఈ టీవీకి పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. ఎడ్జ్ లు మాత్రం చాలా స్లిమ్ గా ఉంటాయి. మిడిల్ డివైజు అత్యధికంగా  7సెంటీమీటర్లు మందంగా ఉంటుంది. స్క్రీన్ చూడటానికి చిన్నగా కనిపించినా...మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. చాలా ఈజీగా ఇన్స్ స్టాల్ చేయవచ్చు. 

స్పెసిఫికేషన్స్, కనెక్టివిటీ.....
స్పెసిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ స్పోర్ట్స్ క్వార్డ్ కోర్ చిప్ పై రన్ అవుతుంది. 1జిబి ర్యామ్, 8జిబి ఇంటర్నల్ స్టోరేజీ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే...మూడు HDMIపోర్ట్ ఉన్నాయి. ఈ మూడు HDMIపోర్ట్స్ తో సెట్ అప్ బాక్స్, అమెజాన్ ఫైర్ స్టిక్, గేమింగ్ కన్సోల్, వంటి వాటిని కనెక్ట్ చేసుకోవచ్చు. వీటితోపాటు మూడు యూఎస్బి పోర్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వైఫై, బ్లూటూత్ ను సపోర్ట్ చేస్తుంది.  Ethernet పోర్టును కూడా ఈ టీవీలో సెటప్ చేశారు. 

పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ....
ఇక పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే....ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఏ ప్రో టీవీని చూసేందుకు 178డిగ్రీల వ్యూ యాంగిల్ తోపాటు 60hz రిఫ్రెష్ రేట్ తో పూర్తిగా హెచ్ డి ఎల్ఈడీ టీవీగా యూజర్లను ఆకట్టుకుంటోంది. అయితే కొంచెం బ్రైట్ నెట్ ప్రాబ్లమ్ ఉన్నట్లు షియోమీ ప్రకటించింది. సినిమాలు, వివిడ్, స్పోర్ట్స్, మానిటర్, గేమింగ్ అండ్ కస్టమ్ వాటిని ప్రకాశవంతమైన సెట్టింగ్స్ తో అందిస్తోంది. ఇక బ్యాక్ గ్రౌండ్ లేదా డార్క్ కలర్స్, డైనమిక్ బ్యాక్ లైటింగ్ చూడటానికి చాలా కంఫర్ట్ గా ఉంటాయి.
సౌండ్ విషయానికొస్తే...సినిమాలు, న్యూస్ లేదా టీవీ షోస్ చూడటానికి అనుకూలంగా ఉంటుంది. ఇక బడ్జెట్ సెగ్మెంట్ అనేది సౌండ్ బార్ తో పోల్చాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మ్యూజిక్ వింటూ యూజర్లు తమకు కావాల్సిన అవుట్ పుట్ సౌండ్ క్వాలిటీ కోసం సౌండ్ బార్ తో టీవీని కనెక్ట్ చేసుకోవచ్చు. 

స్మార్ట్ టీవీ ఎలిమెంట్స్.....
షియోమీ...ఇతర టీవీల మాదిరిగానే...ఒక ప్యాచ్ వాల్ uiతో వస్తుంది. ప్యాచ్ వాల్ యూఐ ఆండ్రాయిడ్ టీవీపై అప్ డేట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ షియోమీ కూడా యూజర్లకు రెండు ఆప్షన్లను అందిస్తుంది. అయినప్పటికి యూజర్లకు నచ్చని కొన్ని అంశాలు ఉన్నాయి. A-Zనుండి ఏర్పాటు చేసిన కీబోర్డు యొక్క లే అవుట్ కు సంబంధించినది , క్వార్టీ ఫార్మట్ కు బదులుగా...ఇది పాస్ వర్డ్స్ లేదా ఏవైనా టెక్స్ట్ తో ఎంటర్ చేస్తుంది. 

టీవీ కూడా క్రోమ్ క్యాస్ట్ ఇన్ బిల్ట్ తో వస్తుంది. దీంతో మీ ఫోన్ నుంచి నేరుగా కంటెంట్ను ప్రసారం చేయడానికి వీలుంటుంది. కానీ నెట్ ఫ్లిక్స్ లేదా అమెజాన్ వంటి యాప్స్ యాక్సెస్ లేదు. కంటెంట్ను ప్రసారం చేయడానికి యూజర్లు అమెజాన్ ప్రైమ్ వీడియో స్టిక్ను ఉపయోగించినటప్పటికీ....ఒరిజినల్ యాప్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. 

ధర...
మీ బడ్జెట్ కు సరిపడా టీవీని కొనుగోలు చేయాలంటే...షియోమీ ఎంఐ ఎల్ఈడి టీవీ 4ఏ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. షియోమీ ఎంఐ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కేవలం 23,999రూపాయలకు అందుబాటులో ఉంది. 
 

జన రంజకమైన వార్తలు