• తాజా వార్తలు

రివ్యూ - 4కే, హెచ్డీఆర్, డాల్బీ విజన్.. ఈ మూడింట్లో బెస్ట్ టీవీ ఏది?

టీవీలు కొనాలనుకున్నప్పుడు మనం చాలా మాటలు వింటాం. ఆల్ట్రా, హెచ్ డీ,  యూహెచ్డీ, 2160పీ, 4కే, 2కే లాంటి పదాలు చాలా వింటాం. మరి వీటన్నిటిలో మనం ఎంచుకునే టీవీల్లో ఏ క్వాలిటీస్ ఉండాలి. అన్ని క్వాలిటీస్ ఉండి తక్కువ ధర దొరికే టీవీలు దొరుకుతాయా? అసలు ఇప్పుడున్న టీవీల్లో బెస్ట్ ఏమిటి?

తేడాలు ఎన్నో..

4కే యూహెచ్డీలో 1080 పిక్సల్స్ నాలుగు రెట్టు ఉంటాయి.క్వాలిటీలో ఛేంజ్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 4కే కన్నా తక్కువ క్వాలిటీ ఉన్న టీవీల్లో అంత ిఇంప్రూమెంట్ కనిపించదు. 4 కే లా హెచ్ డీఆర్ ఎక్కువ పిక్సల్స్ ని యాడ్ చేయదు. అయితే పిక్సల్స్ ని ఇంప్రూవ్ చేయకపోయినా కాంట్రాస్ట్, బ్రైయిట్ నెస్ ని బూస్ట్ చేసి కలర్స్ రేంజ్ ని పెంచుతుంది. 

మిస్ డైరెక్షన్

ఎక్కువ టీవీ కంపెనీలు హెచ్ డీఆర్  అనే మాటను తప్పుదోవ పట్టించాయి. దీంతో చాలామంది కస్టమర్లు హెచ్ డీఆర్ కేపబుల్ లేదా హెచ్ డీఆర్ కంపాటబుల్ వెర్షన్లు మాత్రమే వాడుతున్నారు. హెచ్ డీఆర్ అని అంటే ఇదేమీ అన్ని విభాగాల్లో అద్భుతమైన క్వాలిటీని ఇవ్వదు. ఇది హెచ్ డీఆర్ మెటాడేటాను మాత్రమే రీడ్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా బ్రయిట్ నెస్ విషయంలో అన్ని టీవీలు బాగా పోటీపడుతున్నాయి. హెచ్ డీఆర్ లో 500-1000 నిట్స్ బ్రయిట్ నెస్ వస్తుంది. 

డాల్బీ విజన్

హెచ్ డీఆర్ 4కే టీవీలను తయారు చేసే కంపెనీ డాల్బీ. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా డాల్బీ విజన్ టీవీలు, కెమెరాలే యూజ్ చేస్తున్నారు. దీని యూసేజ్ ఎక్కువ స్పెసిఫిక్ గా ఉంటుంది.దీనిలో ఎన్ కోడింగ్, డీకోడింగ్ వ్యవస్థ ఉంది. మూవీ ప్రొడక్షన్స్ బ్రాడ్ కాస్ట్ టీవీ, టీవీ డిస్ ప్లే కోసం హెచ్ డీఆర్ విజన్ మెటీరీయల్ ను ఉపయోగిస్తారు. 

జన రంజకమైన వార్తలు