• తాజా వార్తలు

రివ్యూ - ఎయిర్‌టెల్‌.. పాత ప్లాన్స్ వ‌ర్సెస్ కొత్త ప్లాన్లు

అన్ని టెలికం కంపెనీల మాదిరిగానే ఎయిర్‌టెల్ కూడా టారిఫ్ ధ‌ర‌లు పెంచింది.  అయితే జియో మాదిరిగా ఇతర నెట్‌వ‌ర్క్‌ల‌కు చేసే కాల్స్‌కు ప‌రిమితి లేక‌పోవడం ఎయిర్‌టెల్ యూజ‌ర్ల‌కు కాస్త ప్ల‌స్‌పాయింట్‌.  ఈ ప‌రిస్థితుల్లో ఎయిర్‌టెల్‌లో పాత టారిఫ్‌లు, కొత్త టారిఫ్‌లను కంపేర్ చేసి చూద్దాం. 

ఎయిర్‌టెల్ 148 ప్లాన్ వ‌ర్సెస్ ఎయిర్‌టెల్ 129 ప్లాన్ 
ఎయిర్‌టెల్ 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన 148 ప్యాక్ ఇది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఫ్రీ.  28 రోజుల‌కు క‌లిపి మొత్తం 2 జీబీ డేటా వ‌స్తుంది. 300 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. గ‌తంలో ఇదే ప్లాన్ 129 రూపాయ‌ల‌కు వ‌చ్చేది. 19 రూపాయలు పెంచారు. 

 

ఎయిర్‌టెల్ 248 ప్లాన్ వ‌ర్సెస్ ఎయిర్‌టెల్ 129 ప్లాన్ 
ఎయిర్‌టెల్ 248 ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వ‌స్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఫ్రీ.  28 రోజులపాటు రోజూ 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఇస్తుంది. గ‌తంలో ఇదే ప్లాన్ 199 రూపాయ‌ల‌కు వ‌చ్చేది. 49 రూపాయలు పెంచారు.   

 

ఎయిర్‌టెల్ 298 ప్లాన్ వ‌ర్సెస్ ఎయిర్‌టెల్ 249 ప్లాన్ 
ఎయిర్‌టెల్ 298 ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వ‌స్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఫ్రీ.  28 రోజులపాటు రోజూ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఇస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రా ప్రీమియం, వింక్ మ్యూజిక్‌ల‌కు ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌. ఉచిత హ‌లో ట్యూన్స్‌, యాంటీ వైర‌స్ మొబైల్ ప్రొటెక్ష‌న్ వంటి  అద‌న‌పు బెనిఫిట్స్ కూడా  ఉన్నాయి. గ‌తంలో ఇదే ప్లాన్ 249 రూపాయ‌ల‌కు వ‌చ్చేది. 49 రూపాయలు పెంచారు. 

 

ఎయిర్‌టెల్ 598 ప్లాన్ వ‌ర్సెస్ ఎయిర్‌టెల్ 448 ప్లాన్ 
ఎయిర్‌టెల్ 598 రూపాయ‌ల ప్లాన్  వ్యాలిడిటీ 84 రోజులు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఫ్రీ.  84 రోజులపాటు రోజూ 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఇస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రా ప్రీమియం, వింక్ మ్యూజిక్‌ల‌కు ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌. ఉచిత హ‌లో ట్యూన్స్‌, యాంటీ వైర‌స్ మొబైల్ ప్రొటెక్ష‌న్ వంటి  అద‌న‌పు బెనిఫిట్స్ కూడా  ఉన్నాయి. గ‌తంలో ఇదే ప్లాన్ 249 రూపాయ‌ల‌కు వ‌చ్చేది. ఏకంగా 150 రూపాయలు పెంచారు. 

 

ఎయిర్‌టెల్ 698 ప్లాన్ వ‌ర్సెస్ ఎయిర్‌టెల్ 499 ప్లాన్ 
ఎయిర్‌టెల్ 598 రూపాయ‌ల ప్లాన్  వ్యాలిడిటీ 84 రోజులు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఫ్రీ.  84 రోజులపాటు రోజూ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఇస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రా ప్రీమియం, వింక్ మ్యూజిక్‌ల‌కు ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌. ఉచిత హ‌లో ట్యూన్స్‌, యాంటీ వైర‌స్ మొబైల్ ప్రొటెక్ష‌న్ వంటి  అద‌న‌పు బెనిఫిట్స్ కూడా  ఉన్నాయి. గ‌తంలో ఇదే ప్లాన్ 499 రూపాయ‌ల‌కు వ‌చ్చేది. అయితే ఇది 82 రోజుల ప్యాకేజి. దీని వ్యాలిడిటీని 2 రోజులు పెంచి ఏకంగా 199 రూపాయ‌లు పెంచేశారు.  

 

ఎయిర్‌టెల్ 2398 ప్లాన్ వ‌ర్సెస్ ఎయిర్‌టెల్ 499 ప్లాన్ 
ఎయిర్‌టెల్‌లో ఏడాది ప్రీపెయిడ్ ప్యాక్ ఇది. ధ‌ర  2398 రూపాయ‌లు.  365 రోజుల‌పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఫ్రీ.  రోజూ 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఇస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రా ప్రీమియం, వింక్ మ్యూజిక్‌ల‌కు ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్‌. ఉచిత హ‌లో ట్యూన్స్‌, యాంటీ వైర‌స్ మొబైల్ ప్రొటెక్ష‌న్ వంటి  అద‌న‌పు బెనిఫిట్స్ కూడా  ఉన్నాయి. గ‌తంలో ఇదే ప్లాన్ 1699 రూపాయ‌ల‌కు వ‌చ్చేది.  ఇప్పుడు ఒకేసారి  699 రూపాయ‌లు పెంచేశారు.  

మ‌ళ్లీ బాదుడు మొద‌లైందా?
ఈ ప్లాన్ల‌న్నీ చూస్తే ఎయిర్‌టెల్‌లో 28 రోజుల ప్యాకేజీలో 40 రూపాయ‌లు పెరిగితే.. ఏడాది ప్యాకేజిలో ఏకంగా 700 రూపాయ‌లు పెరిగింది.  అంటే యూజ‌ర్ల‌కు మ‌ళ్లీ ఎయిర్‌టెల్ షాకివ్వ‌డం మొద‌లెట్టింద‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

జన రంజకమైన వార్తలు