యాపిల్ ఎప్పటి నుంచో తన వినియోగదారులను ఊరిస్తున్న ఐఫోన్ ఎస్ఈ (2020)ని విడుదల చేసింది. ఐఫోన్ మోడల్స్‌లో ఎస్ఈకి చాలా ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఫర్మ్ డిజైన్, సూపర్ పెర్‌ఫార్మెన్స్ దీన్ని మార్కెట్‌లో ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. అయితే ఇప్పటికే మార్కెట్లో ఐఫోన్ 11 ఉంది. ఈ రెండింటిలో ఏది బెస్టో ఈ రివ్యూలో చూద్దాం
డిజైన్‌లో ఐఫోన్11 బెటర్
కొత్త ఐఫోన్ ఎస్ఈ డిజైన్‌పరంగా ఐఫోన్ 8ను పోలి ఉంది. ఇది కాస్త పాత మోడల్‌లాగా ఉంటుంది. ఐఫోన్ 11 లేటెస్ట్ మోడల్‌తో ఆకట్టుకుంటుంది.
* ఐఫోన్ ఎస్ఈ2లో టచ్ ఐడీ బటన్ ఇచ్చింది. అంటే ఆండ్రాయిడ్ ఫోన్లలాగే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌తో పని చేస్తుంది. అదే ఐఫోన్ 11లో అయితే ఫేస్ ఐడీ ఉంది. ఇది అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్.
* ఐఫోన్ ఎస్ఈ2 బ్లాక్, వైట్, రెడ్ కలర్ వేరియేషన్లలో రిలీజయింది. ఐఫోన్ 11 ఆరు రంగుల్లో దొరుకుతుంది.
* ఐఫోస్ ఎస్ఈలో 4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లే 750x1334 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఉంది. 11 అయితే 6.1 ఇంచెస్ లేటెస్ట్ లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉంది. 1792×828 పిక్సెల్స్‌తో రిజల్యూషన్ కూడా టాప్ క్లాస్.
* అయితే రెండు ఫోన్లలోనూ ఏ13 బయోనిక్ చిప్‌సెట్టే ఉంది.
కెమెరాల్లో ఐఫోన్ 11 టాప్
ఐఫోన్ ఎస్ఈ 2లో వెనుకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. నైట్ మోడ్‌లో పని చేయదు. 11లో అయితే వెనకవైపు రెండు 12 ఎంపీ కెమెరాలున్నాయి. ఇందులో ఒకటి అల్ట్రా వైడ్ కెమెరా. డ్యూయల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగి ఉండడం వల్ల ఫోన్ షేక్ అయినా ఇమేజ్ బాగానే వస్తుంది. నైట్ మోడ్‌లో కూడా బాగా పనిచేస్తుంది. 4కే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
* ఎస్ఈ 2లో 7 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటే 11లో 12 ఎంపీ సెల్పీ కెమెరా ఇచ్చింది. ఎస్ఈ2లో సెల్ఫీ కెమెరాకు ఫేస్ ఐడీ లేదు కాబట్టి ఎనిమోజీలు, మెమోజీలు క్రియేట్ చేయలేం. 11లో ఈ ఫీచర్ ఉంది. కాబట్టి ఏ రకంగా చూసినా కెమెరా డిపార్ట్‌మెంట్‌లో ఐఫోన్ 11 ఎస్ఈ 2 మోడల్ కంటే చాలా చాలా అడ్వాన్స్‌డ్.
రెసిస్టెన్స్
ఎస్ఈ2 ఐపీ67 రేటెడ్ ఫోన్. అంటే 1 మీటర్ లోతు నీటిలో అరగంటసేపు ఉంచినా ఈ ఫోన్‌కు ఏమీ కాదు. అదే 11లో ఐపీ 68 రెసిస్టెన్స్ ఉంది. అంటే 2 మీటర్లలోతు నీటిలో పడ్డా అరగంట వరకూ ఏమీ కాదు.
* బ్యాటరీ, చార్జింగ్ విషయాల్లో పెద్ద తేడాలేమీ లేవు.
ధరలో ఎస్ఈ2నే బెటర్
ఐఫోన్ 11 64 జీబీ 68,500 రూపాయలు. అదే ఎస్ఈ2 42,500కే దొరుకుతుంది. అంటే ధరలో 25వేల రూపాయల తేడా ఉంది. 128 జీబీ ఐఫోన్ 11.. 73,600 ధర పలుకుతుంటే ఎస్ఈ 2 ఖరీదు 47,800. అంటే 50 వేల రూపాయల ధరలోనే దొరుకుతుండటం ఎస్ఈ 2కి ఉన్న అడ్వాంటేజ్. కాస్త బడ్జెట్ చూసుకుంటూనే ఐఫోన్ వాడాలనుకునేవారికి ఎస్ఈ2 బెటర్ ఛాయిస్. కాస్త ధర పెట్టగలం.. మంచి ఫీచర్లే కావాలనుకుంటే ఐఫోన్11కే వెళ్లాలి.