• తాజా వార్తలు

5000 ఎంఏహెచ్ బ్యాటరీల్లో ఉత్తమమైన ఫోన్లు ఇవే

ఆండ్రాయిడ్ ఫోన్.. ఇదంటే ిఇప్పుడు పెద్ద క్రేజ్.. కానీ ఇంటర్నెట్ వాడకం ఎక్కువ అయిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ నిలవట్లేదు. అస్తమానం ఫోన్ ను ఛార్జర్ కు తగిలించాల్సి వస్తోంది. అందుకే ఎక్కువమంది ఎక్కువ సమయం నిలిచే ఫోన్ల మీదే మనసు పడుతున్నారు. కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ఇప్పుడు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మరి ఇలాంటి ఫోన్లలో ఉత్తమమైన ఫోన్లు ఏమిటో చూద్దామా..

శాంసంగ్ గెలాక్సీ ఎం30

శాంసంగ్ గెలాక్సీ ఎం30 మోడల్ ఫోన్  ఇటీవలే భారత్ లో రిలీజ్ అయింది. దీని ప్రత్యేకత ఏంటంటే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో ఉండడం. దీనిలో ఉన్న ఫాస్ట్ ఛార్జింగ్ కాపబిలిటీ సర్ఫేస్ వల్ల ఛార్జింగ్ ఎక్కువ కాలం నిలుస్తుంది. 15-20 నిమిషాల వ్యవధిలోనే ఫుల్ ఛార్జింగ్ అయ్యే ఈ ఫోన్ కంటిన్యూగా వాడినా రెండు గంటలకు పైగా వస్తుంది. దీని ధర 14,990 రూపాయిలు.

అసస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో ఎం1

5000 ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్లలో అసస్ జెన్ ఫోన్  మాక్స్ ప్రో ె ఎం1 ఒకటి.  ఈ ఫోన్లోని యూఎస్పీ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం యూజ్ అవుతుంది. సింగిల్ ఛార్జ్ తో రెండు రోజులు మనం స్మార్ట్ ఫోన్ ను యూజ్ చేసుకునే అవకాశం ఉంది. 15 నుంచి 20 నిమిషాల పాటు ఛార్జ్ పెడితే రెండు గంటలు నిలవడం ఈ ఫోన్ ప్రత్యేకత. దీని ధర రూ.7999

నుబియా రెడ్ మ్యాజిక్ 3

5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్లలో నుబియా రెడ్ మ్యాజిక్ 3 కూడా ముందు వరుసలో ఉంటుంది. దీనిలో 30 వాట్ల క్విక్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ చేస్తే చాలు రెండు గంటలకు పైగా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని ధర 35.999

మోటరోలా వన్ పవర్

వివో వై 17

అసెస్ 6 జెడ్ 

మోడల్స్ కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నవే.

 

 

 

జన రంజకమైన వార్తలు