• తాజా వార్తలు

రివ్యూ - స్లిమ్ ప‌వ‌ర్‌ఫుల్  ల్యాప్‌టాప్ల హ‌వా ఎంత‌వ‌ర‌కు సాగుతుంది?

భార‌త్‌లో పీసీ మార్కెటింగ్ విస్తృత స్థాయిలో ఉంది. రోజు రోజుకు పీసీల ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. పీసీతో పాటు ల్యాప్‌టాప్ ధ‌ర‌లు బాగా  పెరిగాయి. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా ల్యాప్‌టాప్‌లు చాలా స్లిమ్‌గా వ‌స్తున్నాయి. వీటిలో స్లిమ్ ప‌వ‌ర్‌ఫుల్ ల్యాప్‌టాప్‌లు ఒక‌టి. ప్ర‌స్తుతం వీటి హవా న‌డుస్తోంది.  మ‌రి భార‌త్‌లో ఈ హ‌వా ఎంత‌కాలం న‌డుస్తుందో తెలుసా!

ఆకారం, బ‌రువు
ల్యాప్‌టాప్ సైజులు, బరువు బ‌ట్టి దాని ధ‌ర నిర్ణ‌యించ‌బ‌డుతుంది. ఉదాహ‌ర‌ణ‌రు అసెస్ ల్యాప్‌టాప్‌లు ఏఎండీ రైజాన్ ప్రాసెస‌ర్‌తో వ‌చ్చాయి. వీటిని వినియోగ‌దారులు బాగా కొనుగోలు చేశారు. దీని ధ‌ర 30 వేల వ‌ర‌కు ఉంటుంది. ప్ర‌స్తుతం మ‌న ఆఫీసుల్లో, కాలేజీల్లో ఎక్కువ‌గా బ‌రువు ఉండే ల్యాప్‌టాప్‌లు ఉప‌యోగిస్తున్నారు. ఇవి మందం ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల బ‌రువు ఎక్కువ‌గా ఉండి క్యారీ చేయ‌డం చాలా క‌ష్టంగా ఉంటుంది. అందుకే వీటి స్థానంలో వ‌చ్చిన స్లిమ్ ల్యాప్ టాప్‌ల‌కు ఆద‌ర‌ణ బాగుంది. 

అసెస్ ముందంజ‌
స్లిమ్ ల్యాప్‌టాప్ అమ్మ‌కాల్లో అసెస్ కంపెనీ ముందంజ‌లో ఉంది. దీని మార్కెట్ షేర్ 5.3 శాతంగా ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ల్యాప్‌టాప్ అమ్మ‌కాల్లో అగ్ర‌స్థానంలో ఉన్న లెనోవో (28.5 శాతం)తో పోల్చుకుంటే అసెస్ అమ్మ‌కాల శాతం త‌క్కువే అయినా... ఇది రోజు రోజుకు పెరుగుతుంద‌ని..అంద‌రూ స్లిమ్ ల్యాప్ టాప్‌ల వైపే చూస్తున్నార‌ని నిపుణుల మాట‌. ఆన్‌లైన్‌లో ప్ర‌ధానంగా ఈ అమ్మ‌కాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వాళ్లు చెబుతున్నారు. 

జన రంజకమైన వార్తలు