• తాజా వార్తలు

గూగుల్ మ్యాప్స్ వ‌ర్సెస్ మ్యాప్స్ గోలో మ‌నం విస్మ‌రించ‌కూడ‌ని విష‌యాలు

గూగుల్ గ‌త సంవ‌త్స‌రం ఆండ్రాయిడ్ గో పేరుతో ఆండ్రాయిడ్ ఓఎస్ ఆప్టిమైజ్డ్ వెర్ష‌న్ రిలీజ్ చేసింది.  ముఖ్యంగా త‌క్కువ మెమ‌రీతో న‌డిచే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ గోను తీసుకొచ్చింది. త‌క్కువ మెమ‌రీతో ర‌న్ అవ్వాలి కాబట్టి త‌న సొంత యాప్స్‌ను ఇందుకు వీలుగా ఆప్టిమైజ్ చేసింది. గూగుల్ గో, జీమెయిల్ గో, యూట్యూబ్ గో, ఫైల్స్ గో, మ్యాప్స్‌గో, అసిస్టెంట్ గో.. ఇలా కీల‌క‌మైన యాప్‌ల‌న్నింటినీ ఆండ్రాయిడ్ గోకు త‌గ్గ‌ట్లుగా సైజ్ త‌గ్గించి రిలీజ్ చేసింది. ఈ యాప్స్ అన్నీ ఆండ్రాయిడ్ గో డివైస్‌ల్లో ప్రీ ఇన్‌స్టాల్ చేస్తారు. కావాలంటే ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని కూడా ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. ఇలా వ‌చ్చిన యాప్స్‌లో మ్యాప్స్ గో గురించి ఇప్పుడు చెప్పుకుందాం. గూగుల్ డివైస్‌ల‌న్నింటినిలోనూ త‌ప్ప‌కుండా ఉండే గూగుల్ మ్యాప్స్‌కీ, ఈ మ్యాప్స్ గో మ‌ధ్య తేడాలేంటి?  పోలిక‌లేంటి? ఓ లుక్కేద్దాం.
 

యాప్ సైజ్‌
మ్యాప్స్ గో యాప్ సైజ్ ఎంత ఉంటుంది?  స్లిమ్‌గా మార్చిన యాప్ కాబట్టి రెండు, మూడు ఎంబీ నుంచి మ్యాగ్జిమం ఓ 5 ఎంబీ వ‌ర‌కు ఉంటుంఇ అనుకుంటున్నారా? అదేం కాదు దాని సైజ్ కేవ‌లం 140 కేబీ.  అదే గూగుల్ మ్యాప్స్ సైజ్ 25 నుంచి 30 ఎంబీ వ‌ర‌కు ఉంటుంది.  ఎంత తేడానో చూశారా?

యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్
సైజ్ త‌క్కువైనా మ్యాప్స్ గో లో ఇంట‌ర్‌ఫేస్ ఏమీ ఇబ్బందిగా ఉండ‌దు. దాదాపు గూగుల్ మ్యాప్స్ అంత ఈజీగా, క్లీన్‌గా ఉంటుంది. అస‌లు కొత్త‌గా మ‌నం చూసిన‌ప్పుడు ఆ రెండింటికీ తేడా కూడా క‌నిపెట్ట‌లేం. మ్యాప్స్ గోలో సెర్చ్ బార్ టాప్‌లో ఉంటుంది. క్విక్ యాక్ష‌న్స్ కోసం కింద భాగంలో ఏర్పాటు ఉంది. కింద కుడివైపు ఫ్లోటింగ్ బ‌ట‌న్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్‌లో కూడా సేమ్ ఉంటుంది. పించ్ టూ జూమ్  ఆప్ష‌న్ ఉన్నా నావిగేష‌న్ డ్రాయ‌ర్‌లో ఆ ఫీచ‌ర్ లేదు.అందుకే పైనున్న త్రీబార్ ఐకాన్‌ను క్లిక్ చేస్తే నావిగేష‌న్ డ్రాయ‌ర్ ఓపెన్ అవుతుంది. గూగుల్ మ్యాప్స్‌లో ఉన్న స్టార్ట్ డ్రైవింగ్‌, వైఫై ఓన్లీ, ఆఫ్‌లైన్స్ మ్యాప్స్ ఫీచ‌ర్లు మ్యాప్స్ గోలో లేవు. అలాగే మీ అకౌంట్ క‌వ‌ర్ ఫోటో టాప్‌లో క‌నిపించే ఫీచ‌ర్ కూడా ఇందులో లేదు.

నావిగేష‌న్ స‌పోర్ట్
నావిగేష‌న్ విష‌యంలో ఇది గూగుల్ మ్యాప్స్‌లాగే కనిపిస్తుంది.  find places, get directions, see live traffic info, and check travel times లాంటి అన్ని ఫీచ‌ర్లు ఉన్నాయి. అయితే లొకేష‌న్‌, రూట్ ఇన్ఫో వంటి వాటికోసం నావిగేష‌న్ బ‌ట‌న్స్‌ను ప్రెస్ చేస్తే మెయిన్ గూగుల్ మ్యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోమ‌ని చెబుతుంది.

రియ‌ల్ టైమ్ లొకేష‌న్‌
మ్యాప్స్ యాప్ దేనికైనా రియ‌ల్ టైమ్ లొకేష‌న్ అనేది ప్రాణం. గ‌త సంవ‌త్స‌రం గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఫీచ‌ర్‌ను యాడ్ చేశారు. దీంతో ప్ర‌స్తుతం మ‌నం ఎక్క‌డున్నామో రియ‌ల్ టైమ్ లొకేష‌న్‌లో చూపిస్తుంది. ఎవ‌రైనా మ‌న‌కు లొకేష‌న్ షేర్ చేసినా, బ‌స్సులో, ట్రైన్‌లో మ‌న‌వాళ్లు ఎవ‌రైనా వెళుతుంటే మ‌నం మానిట‌ర్ చేసుకోవాల‌న్నా లైవ్ లొకేష‌న్ త‌ప్ప‌నిస‌రి.  కానీ ఆ ఇంపార్టెంట్ ఫీచ‌ర్ ఈ మ్యాప్స్ గోలో  లేదు.అయితే ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌, వాట్సాప్‌లోనూ లైవ్ లొకేష‌న్ షేర్ చేసుకోగ‌లుగుతున్నాం కాబ‌ట్టి మ్యాప్స్ గోలో రియ‌ల్ టైమ్ లొకేష‌న్ లేక‌పోయినా ఫ‌ర్వాలేదు అంటున్నారు నిపుణులు.
 

ఆఫ్‌లైన్ మ్యాప్స్‌, పార్కింగ్ 
మ్యాప్స్ గో యాప్‌ను త‌క్కువ ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ ఉండే ఏరియాల కోసం, త‌క్కువ ప్రాసెసింగ్ ప‌వ‌ర్‌తో న‌డిచే ఫోన్ల కోస‌మే త‌యారుచేశారు.కానీ ఇందులో ఆఫ్‌లైన్ మ్యాప్స్‌, పార్కింగ్ ప్లేస్‌లు చూపించే ఆప్ష‌న్ లేదు. ఇది కీల‌క‌మైన‌ లోపం.

* అడ్ర‌స్‌లు, రివ్యూలు, ఫొటోలు యాడ్‌చేసే అవ‌కాశం లేదు.

* హోం, వ‌ర్క్ అడ్ర‌స్‌ల‌ను సెట్ చేసుకునే ఇంపార్టెంట్ ఫీచ‌ర్ కూడా లేదు.

* అయితే మీ ఫోన్‌లోని లాంగ్వేజ్‌ను మార్చుకోకుండానే ఈ యాప్‌లో లాంగ్వేజ్‌ను మార్చుకునే సౌక‌ర్యం ఉంది. 
మొత్తంగా చూస్తే గూగుల్ మ్యాప్స్‌కి ఈ మ్యాప్స్ గో ఏమాత్రం పోటీకాదు. అస‌లు కంపెనీ ఉద్దేశం కూడా అది కాద‌ని, కేవ‌లం లో ఎండ్ ఫోన్ల కోసం త‌క్కువ మెమ‌రీతో చేసింద‌ని చెబుతోంది. అయితే ఉన్న ఫీచ‌ర్ల‌న్నీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్మూత్‌గా ర‌న్న‌వ్వ‌డం మ్యాప్స్ గోలో ప్ల‌స్‌పాయింట్
 

జన రంజకమైన వార్తలు