గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్.. రెండూ గూగుల్ ప్రొడక్ట్లే. ఇవి రెండూ మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇన్‌బిల్ట్‌గానే వచ్చే యాప్స్. ఆండ్రాయిడ్ ఫోన్లో జీమెయిల్ అకౌంట్‌తో లాగిన అవగానే అదే అకౌంట్‌తో గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్ రెండూ యాక్టివేట్ అవుతాయి. మీ జీమెయిల్ అకౌంట్ బ్యాకప్ సెట్ చేసుకుని, సింక్ చేసుకుంటే చాలు మీ ఫోన్లో గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అయిన ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌ను ఎక్కడి నుంచయినా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ మార్చినా ఆటోమేటిగ్గా అందులోకి బ్యాకప్ వచ్చేస్తుంది. బేసిక్‌గా రెండూ స్టోరేజ్ యాప్స్ అయిన గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్‌ల్లో ఏది బెస్ట్? ఈ ఆర్టికల్‌లో చూద్దాం
స్టోరేజ్, స్టోరేజ్ కెపాసిటీ
గూగుల్ ఫోటోస్ ఫోటో గ్యాలరీ యాప్. అదే గూగుల్ డ్రైవ్ అయితే క్లౌడ్ స్టోరేజ్యాప్. గూగుల్ ఫోటోస్ మీ ఫోన్లో ఉంటే మీరు ఫోన్లో తీసే ఫోటోలు, వీడియోలు గ్యాలరీలో చూసినట్లే దీనిలో కూడా సేవ్ అవుతాయి. అదే గూగుల్ డ్రైవ్‌లో అయితే ఫోటోలు, వీడియోలను మీరే అప్లోడ్ చేయాలి. అయితే గూగుల్ ఫోటోస్ ఫోటోలు, వీడియోలు, జిఫ్‌లను మాత్రమే సేవ్ చేస్తుంది. గూగుల్ డ్రైవ్ పీడీఎఫ్, జిప్, ఎంపీ3, ఎంపీ 4, జేపీజీ, పీఎన్జీ ఇలా ఏ ఫార్మాట్లో ఉన్న డేటానయినా స్టోర్ చేసుకుంటుంది. అయితే గూగుల్ ఫోటోస్‌లో మీ ఫోన్లో తీసిన ఫోటోలు, వీడియోలు ఆటోమేటిగ్గా సేవ్ అవుతాయి. అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే డ్రైవ్‌లో అయితే మాత్రం వాటిని మనం అప్లోడ్ చేయాలి. గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్‌ల్లో గానీ ఉన్న ఫైల్స్‌ను ఎక్కడినుంచయినా యాక్సెస్ చేసుకోవాలంటే మాత్రం వాటిని సింక్ చేసుకోవాలి. గూగుల్ ఫోటోస్‌లో అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది. కానీ గూగుల్ డ్రైవ్‌లో మాత్రం 15 జీబీ స్టోరేజే ఉంటుంది. ఇది కూడా జీమెయిల్, గూగుల్ డ్రైవ్‌లో కలిపి.
యూజర్ ఇంటర్ ఫేస్, ఆర్గనైజేషన్
గూగుల్ ఫోటోస్ ఇంటర్ ఫేస్ అచ్చం మీ గ్యాలరీ యాప్స్‌లానే ఉంటుంది. గూగుల్ డ్రైవ్ ఇంటర్ఫేస్ ఫైల్ బ్యాకప్ సర్వీస్‌లు, ఫైల్ మేనేజర్ల మాదిరిగా కనిపిస్తుంది. గూగుల్ ఫోటోస్‌లో ఫోటోలను ఒక ఫోల్డర్ నుంచి మరో ఫోల్డర్లోకి డైరెక్ట్‌గా మార్చలేం. ఇందుకోసం ఫైల్ మేనేజర్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే గూగుల్ డ్రైవ్‌లో మీ ఫోటోలను వేర్వేరు ఫోల్డర్లలో మీరే సెట్ చేసుకోవచ్చు. వాటిని ఒకదాని నుంచి మరోదానిలోకి మూవ్ చేసుకోవచ్చు.
క్వాలిటీ
గూగుల్ ఫోటోస్‌లో 16ఎంపీ క్వాలిటీతో ఫోటోలు, 1080పీ వీడియోలు సేవ్ అవుతాయి. సాధారణ యూసేజ్‌కు ఇది సరిపోతుంది. అదే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు, పెద్ద సైజ్ ఇమేజ్‌లు అవసరమైనవారికి ఫుల్ సైజ్, క్వాలిటీతో అవసరమైనవారికి గూగుల్ డ్రైవ్ మంచి ఆప్షన్. ఇందులో ఫోటో లేదా వీడియోను ఒరిజినల్ సైజ్, క్వాలిటీతో అప్లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు.
ఎడిటింగ్, షేరింగ్ ఆప్షన్స్
గూగుల్ ఫొటోస్ యాప్‌లో క్రాప్, రొటేట్ లాంటి బేసిక్ ఫోటో ఎడిటింగ్ ఫీచర్లుంటాయి. కొలేజ్లు, ఫిల్టర్లు అప్లయి చేసుకోవచ్చు. వీడియో ఎడిటర్ కూడా ఉంది. దీనితో మూవీస్, యానిమేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్‌లో ఇవేమీ ఉండదు. అయితే ఫోటోస్ స్కానింగ్‌కు ఇన్‌బిల్ట్ ఫీచర్ డ్రైవ్‌లో ఉంది. గూగుల్ ఫోటోస్‌లో గూగుల్ లెన్స్ ఉంది. ఫోటో మీద క్లిక్ చేసి ఆ ఫోటో తీసిన ప్లేస్, దాని సమాచారం అంతా తెలుసుకోవచ్చు. డ్రైవ్‌లో ఈ ఫీచర్ లేదు. గూగుల్ డ్రైవ్‌తో ఒకేసారి ఎక్కువమందితో మీ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు. గూగుల్ ఫోటోస్‌లో ఒక పర్సన్‌తోనే షేర్ చేసుకోగలం.
ఏది బెస్టంటే?
ఫోటోస్, వీడియోస్‌కే పరిమితమైనా చాలు అన్లిమిటెడ్ స్పేస్, ఎడిటింగ్ ఫీచర్స్ కావాలనుకుంటే గూగుల్ ఫోటోస్ బెస్ట్ ఆప్షన్. అదే అన్ని రకాల ఫోటోలు, వీడియోలు, డాక్యమెంట్లు స్టోర్ చేసుకోవాలి.. ఒరిజినల్ క్వాలిటీతో ఆర్గనైజ్డ్గా సేవ్చేసుకోవాలనుకుంటే డ్రైవ్ మంచి ఆప్షన్ అవుతుంది.