మార్కెట్లో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చిందంటే చాలు మొబైల్ ప్రియులు వెంటనే దానిపై ఆసక్తి ప్రదర్శిస్తారు. ఆ మొబైల్ ఏంటి? అందులో ఫీచర్లు ఎలా ఉన్నాయి లాంటి విషయాలను ఆరా తీస్తారు. తమకు నచ్చితే వెంటనే కొనేస్తారు. అలా మొబైల్ వేట సాగించే వారి కోసమే బరిలోకి ఒక కొత్త ఫోన్ దిగింది. మంచి ఫీచర్లతో ఆకట్టుకునే విశేషాలతో మార్కెట్లోకి వచ్చేసింది. ఆ ఫోనే హానర్ 8 లైట్. మంచి బిల్ట్ క్వాలిటీ, డిసెంట్ కెమెరా ఫెర్పార్‌మెన్స్, మెరుగైన యూఐ ఈ ఫోన్ సొంతం. ఇటీవలే మొబైల్ ప్రపంచంలోకి వచ్చిన ఈ హువోయ్ సబ్ బ్రాండ్‌కు వినియోగదారులను ఆకట్టకునే అన్ని లక్షణాలు ఉన్నాయి. ఎక్కువ కాలం మన్నిక ఇచ్చేలా తయారు చేసిన ఈ ఫోన్ ఇప్పుడు మార్కెట్లో హట్ హాట్.
గ్లాస్ బాడీతో..
సాధారణంగా ఇప్పుడు వస్తున్న అన్ని స్మార్టుఫోన్లు మెటల్ బాడీతో తయారు అవుతున్నాయి. కానీ హానర్ ఫోన్ మాత్రం గ్లాస్ బాడీతో తయారు చేశారు. అందర్ని ఆకర్షిస్తున్న అంశాల్లో ఇదొకటి. ఇదే అందరికి ప్రిమియం అనుభూతిని అందిస్తోంది. 7.6 మిల్లీ మీటర్ల మందంతో 147 గ్రాముల బరువుతో తయారైన ఈ మొబైల్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. నేవిగేషన్ బటన్లు కూడా చాలా పలచగా ఉన్న ఈ ఫోన్‌లో డిస్‌ప్లే కూడా గొప్పగా ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు లైట్ సెన్సార్ ఈ పోన్ ప్రత్యేకతలు. హైబ్రీడ్ డ్యుయల్ స్లిమ్ స్లాట్, మైక్రో యూఎస్‌బీ పోర్ట్‌లను కూడా హానర్‌లో సౌకర్యవంతంగా అమర్చారు. ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఉన్న ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరో ఆకర్షణ.
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
స్టోరేజ్ విషయంలో, సామర్థ్యం విషయంలో హానర్ 8 మోడల్‌కు తిరుగేలేదు. ఇక డిస్‌ప్లేలోనూ ఇది ముందంజలోనే ఉంటుంది. 5.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే ఈ ఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. హువాయ్ ఇన్ హౌస్ ఆక్టాకోర్ ప్రొసెసర్‌తో దీన్ని రూపొందించారు. అన్నిటికిమించి 4జీబీ ర్యామ్ సామర్థ్యం దీని మరో ప్రత్యేకత. అంతేకాదు ఇంటర్నల్ మెమెరీని 64 జీబీ ఉంది. ఈ మెమెరీని ఎస్‌డీ కార్డ్ ద్వారా 128 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. హానర్ 8 లైట్‌ను ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందించారు. అంతేకాదు దీని బ్యాటరీ సామర్త్యం 3000 ఎంఏహెచ్. డ్యుయల్ సిమ్, 4జీ వీవో ఎల్‌టీఈ, వైఫై 802 అదనపు ఆకర్షణలు.ఇన్నిఫీచర్లు ఉన్న ఈ ఫోన్‌ను హానర్ రూ.17999కు విక్రయిస్తుంది.