• తాజా వార్తలు

రివ్యూ - క్రోమ్ బుక్‌...వ‌ర్సెస్ మిగ‌తా ల్యాప్‌టాప్లు ఏంటంత తేడా?

మీరు ఒక ల్యాప్‌టాప్ కొనాల‌ని అనుకున్నారు.. కానీ బ‌డ్జెట్ మాత్రం చాలా ప‌రిమితంగా ఉంది. అప్పుడు ఎలాంటి ల్యాప్‌టాప్ ఎంచుకుంటారు. మీకు్న బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో స‌రస‌మైన ధ‌ర‌తో ల్యాపీ రావాలంటే ఏం చేస్తారు. అయితే ల్యాప్‌ట‌ప్‌కు ప్ర‌త్యామ్నాయంగా.. మ‌న అవ‌స‌రాలు తీర్చేలా ఉన్న ఒక ఆప్ష‌న్ గురించి మీకు తెలుసా? అదే క్రోమ్ బుక్‌.. ! మ‌రి క్రోమ్‌బుక్‌కి ల్యాప్‌టాప్‌ల‌కు ఉన్న తేడా ఏంటి?

ఏంటీ క్రోమ్‌బుక్‌?
2011లో తొలిసారి క్రోమ్‌బుక్ అనేది అన్‌వీల్ అయింది. ఏస‌ర్ కంపెనీ దీన్ని త‌యారు చేసింది . ఆ త‌ర్వాత శాంస‌గ్ కూడా క్రోమ్‌బుక్ బాట‌లోకి వ‌చ్చింది. దీన్ని లినిక్స్ బేస్డ్ మిష‌న్ ర‌న్నింగ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో దీన్ని రూపొందించారు. గూగుల్ క్రోమ్‌కి ఇది యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. గూగుల్ క్రోమ్ బేస్డ్‌గా ల్యాపీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఉప‌యోగ‌ప‌డేదే క్రోమ్‌బుక్‌. దీన్ని ఉప‌యోగించ‌డం చాలా సుల‌భం. ఎక్క‌డికైనా తీసుకెళ్లొచ్చు. అయితే క్రోమ్‌బుక్‌కి, ల్యాప్‌టాప్‌ల‌కు ప్ర‌ధాన తేడా ఏంటంటే ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌...! క్రోమ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ లేకుండా క్రోమ్‌బుక్ ఎవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌దు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఇది నోట్‌బుక్ ఆప్ష‌న్‌లా ఉంటుంది. ఇది గూగుల్ బేస్డ్‌గా ప‌ని చేస్తూ లినెక్స్ ఆప‌రేటింగ్  సిస్ట‌మ్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది.  ఇది ప్రి ఇన్‌స్టాల్ట్ హార్డ్‌వేర్ల‌లోనే ల‌భ్యం అవుతుంది.

వెబ్ యాప్‌లే ఆధారం
క్రోమ్ ఓఎస్‌లో సొంత‌గా ఇంటిగ్రేటెట్ ఫైల్ మేనేజ‌ర్‌, మీడియా ప్లేయ‌ర్ ఉంటాయి. క్రోమ్ రిమోట్ డెస్క్‌టాప్ లాంటి ఆప్ష‌న్లు అద‌నం. గూగుల్ క్రోమ్ బ్రౌజ‌ర్‌లో కాకుండా సొంత విండోలో ఇవి ఓపెన్ అవుతాయి. అంతేకాక క్రోమ్‌బుక్‌లో అన్ని వెబ్ యాప్‌ల ద్వారానే ర‌న్ అవుతాయి. అయితే ఇందులో ఐ ట్యూన్స్‌, ఫొటోషాప్‌, ఆడిసిటీ లాంటి ఆప్ష‌న్లు ఉండ‌వు. స్కైప్, డిస్‌కార్డ్‌, నెట్‌ఫ్లిక్స్ లాంటివి అందుబాటులో ఉంటాయి. అయితే క్రోమ్‌బుక్‌తో పోలిస్తే ల్యాప్‌టాప్‌లు చాలా ముందంజ‌లో ఉంటాయి. అయితే కొన్ని క్రోమ్‌బుక్‌ల‌కు గూగుల్ ప్లే స్టోర్ యాక్సెస్ కూడా ఉంటుంది. దీని ద్వారా యాప్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అందుకే ల్యాప్‌టాప్‌ను ఎంతో ఖ‌ర్చు పెట్టి కొనే బ‌దులు క్రోమ్ బుక్ ప్రిఫ‌ర్ చేస్తే కొన్ని అవ‌స‌రాలైనా తీర‌తాయి. 

జన రంజకమైన వార్తలు