• తాజా వార్తలు

జియో ఆల్ ఇన్ వన్ ప్యాక్ వర్సెస్ ఎయిర్‌టెల్ 249 ప్లాన్ వర్సెస్ వొడాఫోన్ 229 ప్లాన్‌  

నిన్న మొన్నటి వరకు జియో నుంచి ఏ నెట్వర్క్ కి కాల్ చేసి నా ఉచితమే. దీంతో అన్ని కంపెనీ ల యూజర్లు జియో వాడారు. ఇప్పుడు ఇంటర్  కనెక్ట్ యూసేజ్ ఛార్జీల కింద ఇతర నెట్వర్క్ లకు చేసే కాల్స్ కి నిమిషానికి ఆరు పైసలు ఛార్జ్ చేస్తున్న ట్లు జియో ప్రకటన చేయగానే యూజర్లలో కలకలం మొదలయింది. ఇది తమ బిజినెస్ ను దెబ్బ తీస్తుందని గ్రహించి నజియో యాజమాన్యం ఇతర.నెట్వర్క్ లకు కూడా ఫ్రీ కాల్స్ చేసుకునేందుకు ఆల్ ఇన్ వన్ ప్యాక్ లు ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ , వొడాఫోన్ ఇప్పటికే మార్కెట్లో ఇలాంటి ప్యాక్‌ల‌ను మార్కెట్లోకి తెచ్చాయి.  వీటిలో ఏదీ బెస్టో చూద్దాం.                         

జియో 222 ప్యాక్ వర్సెస్ ఎయిర్‌టెల్‌ వర్సెస్ వొడాఫోన్ 
222 రూపాయలతో జియో రీఛార్జి చేసుకుంటే జియో నుండి జియో అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.  జియో నుండి ఇతర నెట్వర్క్ నంబర్లకు 1000 నిమిషాలు ఫ్రీ. రోజు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. వ్యాలిడిటీ 28 రోజులు.సేమ్ ప్యాక్ ఎయిర్‌టెల్‌లో 249 రూపాయలు. వొడాఫోన్‌లో 229 రూపాయలు. అయితే వీటిలో దేశంలో ఏ నెట్‌వ‌ర్క్‌కైనా 28 రోజులపాటు అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.                                       

జియో 333 ప్యాక్ వర్సెస్ ఎయిర్‌టెల్‌ వర్సెస్ వొడాఫోన్ 
333 రూపాయలతో జియో రీఛార్జి చేసుకుంటే 56 రోజుల‌పాటు జియో నుండి జియో అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.  జియో నుండి ఇతర నెట్వర్క్ నంబర్లకు 1000 నిమిషాలు ఫ్రీ. రోజు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు ఉచితం.  అయితే ఎయిర్‌టెల్, వొడాఫోన్ల‌లో 56 రోజుల వ్యాలిడిటీ ప్యాక్స్ లేవు.

జియో 444, 555 ప్యాక్స్ వర్సెస్ ఎయిర్‌టెల్‌ వర్సెస్ వొడాఫోన్ 
444 రూపాయలతో జియో రీఛార్జి చేసుకుంటే 84 రోజుల‌పాటు జియో నుండి జియో అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.  జియో నుండి ఇతర నెట్వర్క్ నంబర్లకు 1000 నిమిషాలు ఫ్రీ. రోజు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. అయితే 84 రోజుల‌కు ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 1000 ఫ్రీ కాల్స్ స‌రిపోవ‌న్న ఉద్దేశంతో  555 రూపాయ‌ల‌తో జియో మ‌రో ప్యాక్ తీసుకొచ్చింది.  దీనిలో వ్యాలిడిటీ 84 రోజులే.  కానీ ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 3000 నిమిషాలు ఫ్రీ కాల్స్ చేసుకోవ‌చ్చు. . ఎయిర్‌టెల్‌లో 499 రూపాయల‌తో ప్రీపెయిడ్ ప్యాక్ తీసుకుంటే  82 రోజుల‌పాటు ఏ నెట్‌వ‌ర్క్‌కైనా అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్ చేసుకోవ‌చ్చు.  2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఎప్ప‌టిలాగే ఫ్రీ. అదే  వొడాఫోన్‌లో సేమ్ ప్యాక్ 511 రూపాయలు. వ్యాలిడిటీ  84 రోజులు.

ఇంత‌కీ ఏది బెస్ట్‌?
ఓవ‌రాల్‌గా చూస్తే జియో ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు ఇచ్చే ఫ్రీ కాల్స్ మామూలు యూజ‌ర్‌కు స‌రిపోతాయి. కాబ‌ట్టి పెద్ద ఇబ్బంది లేదు. 
ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు ఎక్కువ కాల్స్ చేసేవారికైతే మాత్రం అన్‌లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఇచ్చే ఎయిర్‌టెల్ లేదా వొడాఫోనే ప్ర‌స్తుతానికి బెట‌ర్‌గా క‌నిపిస్తున్నాయి.   మీ ఏరియాలో నెట్‌వ‌ర్క్ రీచ్‌, డేటా స్పీడ్‌ను బ‌ట్టి దీనిపై ఓ నిర్ణ‌యానికి రావ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు