• తాజా వార్తలు

ఎం.ఎస్ ఆఫీస్ లో వివిధ వెర్షన్ల మధ్య ఉన్న వ్యత్యాసమేంటి?

కంప్యూటర్ వాడే ఎవరికైనా ఎంఎస్ ఆఫీస్ గురించి పరిచయం ఉంటుంది. ఏదైనా ఆఫీసులో రికార్డులు దాయడానికి ఎంఎస్ ఆఫీస్ కి మించింది ఏదీ లేదు. డిజిటల్ కాపీలను క్రియేట్ చేయడానికి వాటిని మెయింటెన్ చేయడానికి ఎంఎస్ ఆఫీస్ బాగా యూజ్ అవుతుంది. అయితే కాలనుగుణంగా ఈ టూల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎన్నో వెర్షన్లు అందుబాటులోకి వచ్చాయి. మరి ఎంఎస్ ఆఫీసులో ఈ వెర్షన్లు ఏమిటో చూద్దామా..

ఎంఎస్ ఆఫీస్ 365 హోమ్

ఎంఎస్ ఆఫీసు సాఫ్ట్ వేర్లో 365 హోమ్ కూడా చాలా కీలకమైంది. ఏడాదికి 99.99 డాలర్లు చెల్లించి ఈ వెర్షన్ ని కొనుక్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రొడెక్ట్ ను కొనేముందు ఒక నెల ఉచితంగా వాడుకునే అవకాశం కనిపిస్తోంది మైక్రోసాఫ్ట్. ఆ వెర్షన్ ను 6 కంప్యూటర్లలో వాడుకోవచ్చు. ఈ వెర్షన్లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అవుట్ లుక్, యాక్సెస్, పబ్లిషర్ అనే టూల్స్ లభిస్తాయి. స్కైప్, వన్ డ్రైవ్ సర్వీసులను కూడా పొందొచ్చు.

ఎంఎస్ ఆఫీస్ 365 పర్సనల్

ఈ వెర్షన్ ను మీరు 69.99 డాలర్లకు కొనుక్కోవచ్చు. దీన్ని కేవలం సింగిల్ కంప్యూటర్లో మాత్రమే యూజ్ చేసుకోగలం. దీనిలో ఎంఎస్ ఆఫీస్, ఎక్సల్, పవర్ పాయింట్, అవుట్ లుక్, పబ్లిషర్, వన్ డ్రైవ్ లాంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అదనంగా 1 టీబీ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ కూడా పొందొచ్చు. 

ఎంఎస్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2019

మిగిలిన వెర్షన్లతో పోల్చుకుంటే దీని ధర కాస్త ఎక్కువ. 149.99 డాలర్లతో దీన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ కోర్  అప్లికేషన్నీ దీనిలో మనకు లభిస్తాయి. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటి కోర్ అప్లికేషన్లతో పాటు మరిన్ని అప్ డేటెడ్ వెర్షన్లు లభిస్తాయి. అంతేకా 60 రోజుల పాటు ఉచితంగా టెక్నికల్ సపోర్ట్ కూడా లభిస్తుంది. స్టూడెంట్స్, హోమ్ యూజర్ల కోసమే దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. 

ఎంఎస్ ఆఫీస్ హోమ్ అండ్ బిజినెస్

హోమ్ అండ్ బిజినెస్ వాళ్ల గురించి ప్రత్యేకించి ఆ అప్లికేషన్ ని రూపొందించారు. ధీన్ని ఒక్కసారి కొంటే చాలు. లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన వాటితో పోలిస్తే  దీని ధర చాలా ఎక్కువే. 371.92 డాలర్లు వెచ్చించి దీన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీకు డిజిటల్ లైసెన్స్ కూడా లభిస్తుంది. సింగిల్ పీసీ ద్వారా మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలి.  కోర్ ఎంఎస్ ఆఫీస్ యాప్స్ తో పాటు 60 రోజుల ఉచిత మైక్రో సాఫ్ట్ సపోర్ట్ లభిస్తుంది. 

జన రంజకమైన వార్తలు