• తాజా వార్తలు

రివ్యూ - ఆండ్రాయిడ్ గో వ‌ర్సెస్‌.. ఫ‌ఫ్ వ‌ర్సెస్‌, కియా.. ఏమిటంత వ్యత్యాసాలు ?

ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్ల‌లో భిన్న‌మైన ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌ను వాడుతున్నారు. ఆండ్రాయిడ్ ఓఎస్‌కు పోటీగా మార్కెట్లోకి చాలా ర‌కాల ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లు వ‌చ్చాయి. వీటిలో ముఖ్యమైన‌వి ప‌ఫ్‌, కియా.. మ‌రి ఆండ్రాయిడ్ ఓఎస్‌కు ఫ‌ఫ్‌, కియాల‌కు ఎలాంటి సంబంధం.. వీటిలో ఉన్న తేడాలు ఏంటి.. ఈ మూడు ఆప‌రేటింగ్ సిస్ట‌మ్స్‌లో ఏది ఉత్త‌మ‌మైంది?

క్లౌడ్ మోసాతో..
ఆండ్రాయిడ్ ఓఎస్ గురించి అంద‌రికి తెలుసు. కానీ దీనికి పోటీగా వ‌చ్చిందే ఫ‌ఫిన్ లేదా ఫ‌ఫ్‌. అమెరికా కంపెనీ క్లౌడ్ మోసా దీన్ని త‌యారు చేసింది. స్మార్ట్‌ఫోన్లో స్పీడ్ పెంచ‌డానికి, సెక్యూరిటీని టైట్ చేయ‌డానికి ప‌ఫిన్ యూజ్ అవుతుంది. ఇలాంటి ప్ర‌త్యేక ల‌క్ష‌ణాల‌తో క్లౌడ్ మోసా ప‌ఫిన్‌ను రూపొందించింది. వీలైనంత అద‌న‌పు ప్రొటెక్ష‌న్ ఇవ్వ‌డ‌మే దీని స్పెషాలిటీ.  కియో ఓఎస్‌తో న‌డిచే ఫీచ‌ర్ ఫోన్ల క‌న్నా బెట‌ర్‌గా త‌క్కువ ధ‌ర‌కే దొరికేలా ఫోన్ల‌ను అందించ‌డ‌మే ఫ‌ఫిన్ ల‌క్ష్యం.  ఫీచ‌ర్ ఫోన్ల‌లో అప్లికేష‌న్లు ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల వాటి మ‌న్నిక త‌గ్గిపోతుంద‌ని అందుకే\దీన్ని రెడ్యూస్ చేయ‌డానికే ఈ ఫోన్ల‌ను ప్ర‌వేశపెట్టిన‌ట్టు ఈ సంస్థ తెలిపింది.

గో క‌న్నా బెట‌ర్‌
ఆండ్రాయిడ్ గో ఫోన్ల‌లో ఎక్కువ అప్లికేష‌న్లు వాడే అవ‌కాశాలు ఉన్నా.. దీని వ‌ల్ల ఫోన్ యూసేజ్ మీద ప్ర‌భావం ప‌డుతుంది. ఇది నెమ్మ‌దిగా బ్యాట‌రీని హ‌రించేస్తుంది. ఫోన్ మ‌న్నిక ఎక్కువ కాలం ఉండ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలో ఎక్కువ అప్లికేష‌న్లు వాడినా కూడా ఫోన్ మ‌న్నిక‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఫ‌ఫిన్ ఓఎస్‌ను త‌యారు చేశారు. పైగా ఏ సెంట్ర‌లైజ్డ్ రెగ్యులేటరీ బాడీ నుంచైనా ఉచితంగా ల‌భిస్తుంది. డెవ‌ల‌ప‌ర్స్ ఓపెన్ వెబ్ స్టాండ‌ర్డ్స్‌ను వాడొచ్చు. ఫ‌ఫిన్ ఇందుకోసం అవ‌తార్ టెక్నాల‌జీ యూజ్ చేస్తుంది.

జన రంజకమైన వార్తలు