• తాజా వార్తలు

రివ్యూ - రెడ్ మీ నోట్ 8 వ‌ర్సెస్ రెడ్‌మీ నోట్ 7 ప్రో.. రెండింటిలో ఏది బెస్ట్‌

బ‌డ్జెట్ ఫోన్ల స్థాయిని మ‌రింత పైకి తీసుకెళ్లిన ఫోన్ రెడ్‌మీ నోట్ 7 ప్రో. ఈ ఫోన్ రిలీజ‌య్యేనాటికి మార్కెట్లో 30 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్ కూడా లేదు. అలాంటిది ఏకంగా 48 మెగాపిక్సెల్ క‌మెరా అనేస‌రికి ఫోన్ యూజ‌ర్లంద‌రూ ఫిదా అయ్యారు. గ్రేడియంట్ గ్లాస్ బ్యాక్ దీనికి మ‌రో ఆక‌ర్ష‌ణ‌. అయితే ఏడాది తిర‌గ‌క‌ముందే అదే రెడ్‌మీ నుంచి రెడ్‌మీ నోట్ 8 మార్కెట్లోకి రిలీజ‌యింది. రెడ్‌మీ నోట్ 7 ప్రో ధ‌ర 11,999 నుంచి ప్రారంభ‌మైతే కొత్త రెడ్‌మీ నోట్ 8 ధ‌ర 9,999 నుంచే మొద‌ల‌వుతుంది. రెండు వేల ధ‌ర త‌క్కువ‌గా ఉండ‌టం, లేటెస్ట్ మోడ‌ల్ అయిన రెడ్‌మీ నోట్ 8ను ఎంచుకోవాలా?  పాత మోడ‌లే అయినా ప‌వ‌ర్‌ఫుల్ అయిన నోట్ 7 ప్రోను సెలెక్ట్ చేసుకోవాలా అన్న‌ది ఇప్పుడు యూజ‌ర్ల‌లో గంద‌ర‌గోళం. ఈ అయోమ‌యాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్న‌మే ఈ రివ్యూ. 
 

లుక్ 
రెండు ఫోన్లూ చూడ‌డానికి దాదాపు ఒకేలా ఉన్నా రెడ్‌మీ నోట్ 7 ప్రో క‌న్నా నోట్  8 ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది.  రెండూ క‌ర్వ్డ్ ఎడ్జెస్‌తోనే ఉంటాయి. రెండింటిలోనూ ఫ్రంట్‌, బ్యాక్ కూడా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌తో వ‌చ్చాయి.  బ్యాక్‌సైడ్ గ్రేడియంట్ 7 క‌న్నా 8లో బాగుంది. 

ప్రాసెస‌ర్‌లో 7 బెస్ట్ 
ఇక ఫోన్ ప‌నితీరు విష‌యానికి వ‌స్తే రెడ్‌మీ 8లో స్నాప్‌డ్రాగ‌న్ 665 ప్రాసెస‌ర్ ఉంది. అయితే దీనికంటే ముందు వ‌చ్చిన నోట్ 7 ప్రోలో దీని కంటే ప‌వ‌ర్‌ఫుల్ అయిన స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్ ఉంది. కాబట్టి ఫోన్ స్పీడ్ విష‌యంలో నోట్ 7 ప్రోనే బెస్ట్‌. 

మెమ‌రీ కార్డు
రెండూ ఫోన్లు ఒక‌టే వేరియంట్స్‌తో ఉన్నాయి. 4జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌/ 64 జీబీ స్టోరేజ్‌తో మొత్తం మూడు వేరియంట్లు లాంచ్ చేశారు.  అయితే నోట్ 7 ప్రోలో హైబ్రిడ్ సిమ్ కార్డు స్లాట్ ఉంది. దీన్ని కావాలంటే మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌గా వాడుకోవ‌చ్చు. అదే నోట్ 8లో సిమ్ ట్రేలో ప్ర‌త్యేకంగా మైక్రో ఎస్డీ కార్డ్‌కు ప్లేస్ ఇచ్చారు. 

కెమెరా
కెమెరాల విష‌యానికి వ‌స్తే రెడ్‌మీ నోట్ 7 ప్రోలో రెండు కెమెరాలున్నాయి. ఇందులో ఒక‌టి 48 మెగాపిక్సెల్ రియ‌ర్ కెమెరా.  నోట్ 8లో నాలుగు కెమెరాలున్నాయి. 7లో డెప్త్ సెన్సింగ్ సెకండ‌రీ కెమెరా మాత్ర‌మే ఉంది. 8లోకి వ‌చ్చేస‌రికి డెప్త్ సెన్సింగ్ సెకండ‌రీ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, మాక్రో కెమెరాలున్నాయి. అయితే నోట్ 7 ప్రోలో ఉన్న 48 మెగాపిక‌సెల్ కెమెరా సోనీ ఐఎంఎక్స్‌586 సెన్స‌ర్‌. ఇది వ‌న్‌ప్ల‌స్ 7, 7టీ వంటి ప్రీమియం ఫ్లాగ్‌షిప్  ఫోన్ల‌లో వాడే కెమెరా. అదే నోట్ 8లో శాంసంగ్ జీఎం1 సెన్స‌ర్ ఉంది. దీని కంటే నోట్ 7లో ఉన్న కెమెరా చాలా బాగుంటుంది. ఆల్ట్రా వైడ్ షాట్స్ అవ‌స‌రం లేద‌నుకుంటే నోట్ 7 ప్రో మంచి ఆప్ష‌న్‌. 

పెర్‌ఫార్మెన్స్ 
స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్ ఉండ‌టంతో నోట్ 7 ప్రో .. నోట్ 8 క‌న్నా మంచి పెర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. ప‌బ్జీ లాంటి హెవీ గేమ్స్ ఆడాలంటే 8 కంటే 7 ప్రోనే బెటర్‌. మీరు సాధార‌ణ యూజ‌ర్ అయి ఉండి, పెద్ద‌గా గేమ్స్ ఆడ‌టంపై ఇంట్రెస్ట్ లేక‌పోతే మీకు 7ప్రో, 8 ఏదైనా ఒక‌టే. 

బ్యాట‌రీ 
రెండు ఫోన్ల‌లోనూ 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీలే ఉన్నాయి. రెండింట్లోనూ యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌లే ఇచ్చారు. అయితే 7లో 10 వాట్స్ ఛార్జ‌ర్ ఇస్తే నోట్ 8లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జ‌ర్ ఇచ్చారు.  కాబట్టి ఛార్జింగ్ ప‌రంగా చూస్తే 8 బెట‌ర్‌. 

ధ‌ర 
రెడ్‌మీ నోట్ 7 ప్రోలో  4జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్ వెర్ష‌న్ 11,999 రూపాయ‌లు.  నోట్ 8లో ఇది 9,999.  6జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్ ఉన్న నోట్ 7 ప్రో 14,999.  నోట్ 8లో ఇది 12,999 మాత్ర‌మే.  అంటే లేటెస్ట్ మెడ‌ల్ ఫోన్ పాత మోడ‌ల్ ఫోన్‌కంటే రెండు వేల రూపాయ‌లు త‌క్కువ‌కే దొరుకుతుంది. 

ఫైనల్‌గా ఏంటి? 
ఫైన‌ల్‌గా ఈ రెండు ఫోన్ల‌లో ఏది బెస్ట్ ఆప్ష‌న్ అంటే అది మీ అవ‌స‌రాల ఆధారంగా సెలెక్ట్ చేసుకోవాల్సిందే.  ఆల్ట్రా వైడ్ ఫోటోలు, ఎక్కువ బ్యాట‌రీ యూసేజ్ కావాలి.. పెర్‌ఫార్మెన్స్ కొద్దిగా తక్కువ‌గా ఉన్నా స‌రే త‌క్కువ బ‌డ్జెట్‌లో కావాల‌నుకుంటే 8 సెలెక్ట్  చేసుకోవ‌చ్చు. కాదు పెర్‌ఫార్మెన్స్‌, ఫోటో క్వాలిటీ ఇలాంటివ‌న్నీ ఉండాలి రెండు వేలు ఎక్కువ పెట్ట‌డానికి అయినా సిద్ధ‌మంటే 7 ప్రోకి వెళ్లొచ్చు. 

జన రంజకమైన వార్తలు