• తాజా వార్తలు

రివ్యూ - 10 వేల లోపు ఫోన్లలో ..  రెడ్‌మీ నోట్ 8 వ‌ర్సెస్ రియ‌ల్‌మీ 3ప్రో.. ఎవ‌రు హీరో?

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అత్యంత కీల‌క‌మైన 10వేల రూపాయ‌ల సెగ్మెంట్‌లో త‌న ప‌ట్టు జారిపోకుండా షియోమి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందుకోసం త‌న లేటెస్ట్ మోడ‌ల్ రెడ్‌మీ నోట్ 8 ఫోన్‌ను 10వేల రూపాయ‌ల్లోపు ధ‌ర‌లోనే లాంచ్ చేసింది.  అయితే షియోమికి ఈ సెగ్మెంట్‌లో మంచి పోటీ ఇస్తున్న రియ‌ల్‌మీ కూడా త‌న రియ‌ల్‌మీ 3 ప్రో మోడ‌ల్‌ను 9,999కి తగ్గించేసింది. అంటే ఇప్పుడు ఈ రెండు ఫోన్లూ ఒకే ధ‌ర‌లో దొరుకుతున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో 10వేల లోపు ఫోన్ల‌లో రెడ్‌మీ నోట్ 8 వ‌ర్సెస్ రియ‌ల్‌మీ 3 ప్రో ఏది బెస్టో చూద్దాం. 

డిజైన్ అండ్ బిల్డ్ 
రెడ్‌మీ నోట్ 8, రియ‌ల్‌మీ 3 ప్రో.. రెండు ఫోన్లు కూడా చూడ్డానికి ప్రీమియం లుక్‌తోనే క‌నిపిస్తున్నాయి. రెడ్‌మీ నోట్ 8 క‌ర్వ్డ్ ఎడ్జెస్‌తో ఉంది. ఫ్రంట్‌, బ్యాక్ కూడా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్ ఉంది.  బ్యాక్‌సైడ్ గ్రేడియంట్ బాగుంది. అదే రియ‌ల్‌మీ 3 ప్రో పాలికార్బ‌నేట్ బాడీతో వ‌చ్చింది. చూడ్డానికి గ్లాస్‌లా క‌నిపించినా ఆ స్థాయి ఫినిష్ లేదు.  ఓవ‌రాల్‌గా లుక్ బాగున్నా రెడ్‌మీ నోట్ 8లో ఉన్న ఫుల్‌గ్లాస్ బాడీ చూడ్డానికి బాగుంది. అయితే రియ‌ల్‌మీ 3 ప్రోలో ఇచ్చిన ప్లాస్టిక్ బాడీ మ‌న్నిక‌గా ఉంద‌ని చెబుతున్నారు. రెండు ఫోన్ల‌లో టాప్ నాచ్ ఉంది. ఆ ప్లేస్‌లో ఫ్రంట్ కెమెరా పెట్టారు. రెండింటిలోనూ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వెన‌క‌వైపే అమ‌ర్చారు. రెండు ఫోన్లూ ఫేస్ అన్‌లాక్‌ను కూడా స‌పోర్ట్ చేస్తున్నాయి. 

డిస్‌ప్లే
రియ‌ల్‌మీ 3 ప్రో, రెడ్‌మీ నోట్ 8.. రెండింటిలోనూ 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే ఉంది. టాప్‌లోవాట‌ర్ డ్రాప్ నాచ్ ఉంది.  రెడ్‌మీలో నాచ్ కాస్త చిన్న‌గా ఉండి వీ షేప్‌లో ఉంది. రెండు ఫోన్ల డిస్‌ప్లే మినిమం బీజిల్స్‌తో చూడ్డానికి చాలా పెద్ద‌గా క‌నిపిస్తున్నాయి. 

హార్డ్‌వేర్‌
 రెడ్‌మీ నోట్  8లో స్నాప్‌డ్రాగ‌న్ 665 ప్రాసెస‌ర్ ఉంది. దీనిలో 4, 6, 8 జీబీ ర్యామ్ ఆప్ష‌న్లు ఉన్నాయి. అదే రియల్‌మీ 3 ప్రోకి వ‌చ్చేసిరికి స్నాప్‌డ్రాగ‌న్ 710 చిప్‌సెట్‌తో 8 జీబీ ర్యామ్‌తో వ‌చ్చింది.  ర్యామ్ ఎక్కువ‌గానే ఉంది కాబట్టి రెండు ఫోన్ల‌లోనూ మ‌ల్టీ టాస్కింగ్ చేసుకోవ‌చ్చు. దీనితోపాటు హైఎండ్ గేమ్స్ కూడా ఆడుకోవ‌చ్చు.

పెర్‌ఫార్మెన్స్ 
స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్ ఉండ‌టంతో నోట్ 7 ప్రో .. నోట్ 8 క‌న్నా మంచి పెర్‌ఫార్మెన్స్ ఇస్తుంది. ప‌బ్జీ లాంటి హెవీ గేమ్స్ ఆడాలంటే 8 కంటే 7 ప్రోనే బెటర్‌. మీరు సాధార‌ణ యూజ‌ర్ అయి ఉండి, పెద్ద‌గా గేమ్స్ ఆడ‌టంపై ఇంట్రెస్ట్ లేక‌పోతే మీకు 7ప్రో, 8 ఏదైనా ఒక‌టే. 

సాఫ్ట్‌వేర్‌
రియ‌ల్‌మీ 3ప్రోలో క‌ల‌ర్ ఓఎస్‌6యూఐ ఉంది. త్వ‌ర‌లో 7కి కూడా అప్‌డేట్ అవుతుంది. రెడ్‌మీ 9లో ఎంఐయూఐ 10 వెర్ష‌న్ ఓఎస్ ఇచ్చారు. త్వ‌ర‌లో ఎంఐయూఐ 11 అప్‌డేట్ కూడా రానుంది. దీనిలో ఫైల్ మేనేజర్‌కి థంబ్‌నెయిల్స్ ఫీచ‌ర్ కూడా రానుంది. 

కెమెరా
కెమెరాల విష‌యానికి వ‌స్తే రెడ్‌మీ నోట్ 8లో నాలుగు కెమెరాలున్నాయి.  ఇవి డెప్త్ సెన్సింగ్ సెకండ‌రీ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరా, మాక్రో కెమెరాలున్నాయి.  దీనిలో మెయిన్ కెమెరా 48 ఎంపీ శాంసంగ్ జీఎం1 సెన్స‌ర్ ఉంది. రియ‌ల్ మీ 3 ప్రోలో రెండు కెమెరాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇందులో ప్రైమ‌రీ కెమెరా వ‌న్‌ప్ల‌స్ 6లో ఉండే ఫ్లాగ్‌షిప్ కెమెరా ఇచ్చారు.  25ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌576 సెన్స‌ర్‌. రెండింట్లోనూ మంచి ఫోటోలు తీసుకోవ‌చ్చు. అయితే రెడ్‌మీ 8లో వైడ్ యాంగిల్ కెమెరా అద‌న‌పు ఆకర్ష‌ణ‌. 

బ్యాట‌రీ 
రెడ్‌మీ నోట్‌8లో 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్  ఇచ్చారు. నోట్ 8లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జ‌ర్ ఇచ్చారు. రియ‌ల్‌మీ 3 ప్రోలో 4,4045 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వూక్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాల‌జీతో వ‌చ్చింది. దీంతో ఫోన్‌ను 80 నిముషాల్లో ఫుల్ ఛార్జింగ్ చేసుకోచ్చు. అదే రెడ్‌మీలో ఫుల్ ఛార్జింగ్‌కు 110 నిముషాలు ప‌డుతుంది.అంటే బ్యాట‌రీ, చార్జింగ్ ప‌రంగా చూస్తే రియ‌ల్ మీ 3 ప్రో బెట‌ర్ ఆప్ష‌న్‌.  రెండు ఫోన్లు కూడా ఫుల్ ఛార్జింగ్‌ రోజంతా ప‌ని చేస్తాయి. 

ధ‌ర  
రియ‌ల్‌మీ  3ప్రో ధ‌ర త‌గ్గించారు.  4జీబీ ర్యామ్‌, 64 జీబీ రామ్ వెర్ష‌న్ ధ‌ర 9,999 రూప‌యాలు. 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వెర్ష‌న్ ధ‌ర 11,999. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ రామ్‌తో వ‌చ్చిన హైఎండ్ మోడ‌ల్ ధ‌ర 12,999.  రెడ్‌మీ నోట్ 8కు వ‌చ్చేస‌రికి 4జీబీ ర్యామ్‌, 64 జీబీ రామ్ వెర్ష‌న్ ధ‌ర 9,999 రూపాయ‌లు.  6జీబీ ర్యామ్‌, 128 జీబీ రామ్‌తో వ‌చ్చిన హైఎండ్ మోడ‌ల్ ధ‌ర 12,999. అంటే రెండు ఫోన్ల ధ‌ర ఒక‌టే. కాబ‌ట్టి ధ‌ర విషయంలో ఎలాంటి తేడా లేదు. 

ఫైన‌ల్‌గా ఏది బెట‌ర్‌? 
రెండు ఫోన్ల ధ‌ర‌లూ ఒక‌టే. కెమెరా, బాడీ గ్లాస్ వంటి విష‌యాల్లో రెడ్‌మీ నోట్ 8 టాప్‌లో ఉంటే బ్యాట‌రీ కెపాసిటీ, ఛార్జింగ్ స్పీడ్ విష‌యంలో రియ‌ల్‌మీ 3 ప్రో ముందంజ‌లో ఉంది. మిగిలిన విషయాల్లో రెండూ దాదాపు ఒక‌టే. అయితే హైనాచ్, బాడీ గ్లాస్‌, కెమెరా వంటి ఫీచ‌ర్ల ప్ర‌కారం చూస్తే రెడ్‌మీ నోట్ ఇందులో విన్న‌ర్ అని చెప్పొచ్చు. అయితే టాప్ హార్డ్‌వేర్ పెర్‌ఫార్మెన్స్‌, బ్యాట‌రీ బ్యాక‌ప్ కోరుకునేవారికి రియ‌ల్‌మీ 3 ప్రో మంచి ఆప్ష‌న్‌. 

జన రంజకమైన వార్తలు