• తాజా వార్తలు

రివ్యూ: శాంసంగ్ గెలాక్సీ ఆల్ర్టాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌పై మినీ రివ్యూ

శాంసంగ్ గెలాక్సీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ‌గా అమ్ముడుపోయే మొబైల్స్‌లో ఒక‌టి. ప్ర‌తి వెర్ష‌న్‌లోనూ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు శాంసంగ్ చాలా ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇందుకోసం కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను యాడ్ చేస్తుంది. దీనిలో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్‌10 మోడ‌ల్‌లో ఆల్ట్రా సోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను పొందుప‌రించింది ఈ కొరియా మొబైల్ సంస్థ‌. ఫింగ‌ర్‌ప్రింట్ ఆప్ష‌న్ దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ల‌లో ఉంటుందిప్పుడు. అయితే ఆల్ట్రా సోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉండ‌డ‌మే దీనికి ప్ర‌త్యేక‌త‌. మరి ఏంటి ఈ ఆల్ట్రా సోనిక్ సెన్సార్ స్పెషాలిటీ?

శాంసంగ్ ఇటీవ‌లే గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లో భాగంగా నాలుగు ఫోన్ల‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. గెలాక్సీ ఎస్ 10, గెలాక్సీ ఎస్‌10 ప్ల‌స్‌, ఎస్‌10 ఇ, ఎస్‌10 5జీ వేరియంట్స్‌లో రిలీజ్ అయ్యాయి. వీట‌లో గెలాక్సీ ఎస్ఇ మోడ‌ల్‌ను మిన‌హాయిస్తే మిగిలిన మూడు మోడ‌ల్స్‌లో క్వాల్‌కామ్ న్యూ ఆల్ట్రా సోనిక్ ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్ ఆప్ష‌న్ క‌లిగి ఉన్నాయి. ఈ సెన్సార్ చాలా క‌చ్చితత్వంతో కూడిన‌దే కాదు మ‌న డివైజ్‌కు ఎంతో సెక్యూరిటీ ఇస్తుంద‌ట‌.  ఆప్టిక‌ల్ ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ క‌న్నా ఇదెంతో ఎఫెక్టిక్ కూడా అని శాంసంగ్ చెబుతోంది. 

ఎలా ప‌ని చేస్తుందంటే..
శాంసంగ్ ఆల్ట్రాసోనిక్ ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్ ప‌ని తీరు కూడా చాలా సుల‌భంగా ఉంటుంది. మీరు డిస్‌ప్లేని ట‌చ్ చేసిన‌ప్పుడు ఒక ఎల‌క్ట్రిక‌ల్ సిగ్న‌ల్ జ‌న‌రేట్ అవుతుంది. ఆ సిగ్న‌ల్ నేరుగా సెన్సార్‌కు చేరుతుంది. అలా చేరిన సిగ్న‌ల్ ప్రెష‌ర్ వేవ్‌గా క‌న్వర్ట్ అవుతుంది. అదే మీ ఫింగ‌ర్‌ను తాకి మ‌ళ్లీ పున‌ర్ స్థితికి వెళుతుంది. దీని వ‌ల్ల మీ ఫింగ‌ర్‌ను స్కాన్ చేసి అప్ప‌టికే రిజిస్ట‌ర్ అయిన ఫింగ‌ర్ ప్రింట్ ఈ డివైజ్‌ను గుర్తు ప‌డుతుంది. మిగిలిన సెన్సార్‌ల‌తో పోలిస్తే ఇదెంతో ఆక్యురేట్ అని చెప్పొచ్చు. 

జన రంజకమైన వార్తలు