• తాజా వార్తలు

రివ్యూ - టాటా స్కై వర్సెస్ ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ.. ఏది మనకు లాభిస్తుంది? 

కేబుల్ టీవీలకు కాలం చెల్లిపోతుంది ఇప్పుడంతా డిటిహెచ్‌లదే హవా. ఈ రేసులో టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ అంటే సై అంటే సై అంటున్నాయి. ఆఫర్లతో వినియోగదారుని ఆకట్టుకునేందుకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రెండింటిలో దేని ఎంచుకుంటే బాగుంటుందో చెప్పే ప్రయత్నమే ఈ రివ్యూ. టాటా స్కై ఇటీవలే ఇండియాలో నెంబర్ వన్ డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్ గా నిలబడింది. డిష్ టివిని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్‌లోకి వచ్చింది. వినియోగదారుల సంఖ్యను బట్టి ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ మూడో స్థానంలో ఉంది.


సెట్‌టాప్ బాక్స్‌ల‌పై డిస్కౌంట్లు
మరింతమందిని తమ ఖాతాదారులుగా చేర్చుకునేందుకు ఎయిర్‌టెల్, టాటా స్కై పోటాపోటీగా ధరలు తగ్గిస్తున్నాయి. ఎయిర్‌టెల్ సెట్‌టాప్ బాక్సుల పై 200 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు హెచ్ డి సెట్‌టాప్ బాక్స్ 1300కు, ఎస్‌డీ సెట్‌టాప్  బాక్స్ 1100కు లభిస్తుంది. మరోవైపు టాటా స్కై కూడా దీపావళి ఆఫర్ కింద సెట్‌టాప్ బాక్సుల‌పై ధర తగ్గించింది. ఇప్పుడు టాటా స్కై ఎస్‌డీ సెట్‌టాప్ బాక్స్ 1100కు, హెచ్‌డీ సెట్‌టాప్ బాక్స్ 1200కు దొరుకుతుంది. 

రీఛార్జ్ ప్లాన్స్‌లోనూ పోటీ 
లాంగ్‌ట‌ర్మ్ రీఛార్జి ప్లాన్స్‌లోనూ రెండు కంపెనీల మధ్య ప్రైస్ వార్ నడుస్తుంది అయితే ఈ రేసులో ఎయిర్‌టెల్‌ డిజిటల్ టీవీ ముందుంది. వన్ ఇయర్ రీఛార్జ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ మనీ లేదా ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే టెన్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అదేవిధంగా 11 నెలలు ఒకే ప్లాన్ వాడిన వినియోగదారులకు 12వ నెల ఫ్రీగా ఇస్తుంది. ఇక టాటాస్కై విషయానికొస్తే దీనిలో లాంగ్ ట‌ర్మ్ ప్లాన్స్ తక్కువగా ఉన్నాయి. కేవలం ఆరు నెలలు, సంవత్సరం రీఛార్జ్ ప్లాన్లు మాత్రమే అందుబాటులో పెట్టారు. ఇందులో కూడా 11 నెలలు ఒకే ప్లాన్ వాడితే 12వ నెల ఫ్రీ.

మల్టీ టీవీ పాలసీల్లో ఎయిర్‌టెల్ టాప్ 
ఒకే డిటిహెచ్ కనెక్షన్ తో ఒకటి కంటే ఎక్కువ టీవీలు చూడగలిగే మల్టీ టీవీ పాలసీని టాటా స్కై ఇటీవల  తొలగించింది. మరోవైపు ఎయిర్‌టెల్ తన కస్టమర్లు ఒక డిటిహెచ్ కనెక్షన్‌కు అదనంగా 80 రూపాయలు,  కంటెంట్ ఛార్జీలు చెల్లిస్తే అదే కనెక్షన్‌తో రెండో టీవీలో కూడా ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ చూసే అవ‌కాశం క‌ల్పిస్తుంది. మరోవైపు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై నడిచే ఎయిర్‌టెల్ ఎక్స్ బాక్స్ కంటెంట్ తో కూడిన హైబ్రిడ్ సెట్‌టాప్ బాక్సుల విషయంలో ఎయిర్‌టెల్ టాటా స్కైను వెనక్కి నెట్టి దూసుకెళ్లింది.                

ఇంతకీ ఏది బెస్ట్?                
సెట్ టాప్ బాక్సుల ధర విషయంలో టాటా స్కై ఒక వంద రూపాయలు తక్కువకే ఇస్తుంది. అయితే లాంగ్‌ట‌ర్మ్ రీఛార్జి ప్లాన్స్, మల్టీ టీవీ పాలసీ, హైబ్రిడ్ సెట్ టాప్ బాక్స్ వంటి ఇతర విషయాల్లో మాత్రం ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ క నెక్షన్ తీసుకోవడమే ప్రస్తుత పరిస్థితిలో కస్టమర్లకు లాభదాయకం.

జన రంజకమైన వార్తలు